గతంలో ఎవరైనా ఉత్తమబ్లాగుల విషయంలో సలహాలు,సూచనలు అందించమని చెప్పాను గని ఎవరూ పెద్దగా స్పందించలేదు. అసలు ఈ శీర్షికను నడపడమే కష్టమని కొంతమంది ప్రముఖులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఏ ప్రాతి ప్రదికపై మీరు ఉత్తమ బ్లాగులుగా సెలెక్ట్ చేస్తారు అని అడిగారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రశ్నలకు సమాధానం కష్టమే! అయినప్పటికీ మన కృషి మనం చేస్తే పోయేదేముంది అన్న ఉద్దేశ్యంతో ఈపనికి పూనుకున్నాను. నా ఆలోచనల ప్రకారం ప్రతి విభాగానికి 10బ్లాగుల చొప్పున 10 విభాగాల్ను ఎన్నుకుంటే బాగుంటుంది అనిపించింది. ఉదాహరణకు: 1.సాహిత్యం, 2.ఆధ్యాత్మికం, 3.సాకేతికం 4.రాజకీయ విశ్లేషణలు 5.సినిమా విశ్లేషణలు, 5.వింత ప్రపంచం 6.చదువు సంధ్యలు 7.సంపాదనా మార్గాలు 8.వార్తలు - వాయింపులు 9.షాపింగ్ మాల్స్ 10.పుస్తకాలు.
పైవన్నీ 100ఉత్తమ బ్లాగుల్లో 10విభాగాలు. అవి మరింత మెరుగైన సేవలకోసం మారవచ్చు కూడా! ముఖ్యంగా ఒకో విభాగంలో అనేక బ్లాగులుండవచ్చు. అయితే ఏదైతే టపాల తరచుదనం ఉంటుందో అది మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే చక్కగ బ్లాగును ఎల్లప్పుడూ రాసేవారికి ఈ సౌకర్యం కల్గించడం భావ్యం అని నా భావం. ఈ నా ప్రయత్నం మీకందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాలకై ఎదురుచూస్తూ....@ కె.యస్.చౌదరి.

ReplyDeleteఅగ్రిగేటర్ లో ఒక రోజో రెండు రోజులో వెలిగి పోయే 'తారలకి' ఇంత బిల్డప్ అవసరమా !! మరీ చాడస్తముస్మీ !!
Make agregator like erstwhile haaram dot com ; Rest all will take care !! (especially the comments section of that site so far no one could beat ! btw, what happened to that site and reddy gaaru?)
cheers
zilebi