తెలుగు బ్లాగుల వేదిక "బ్లాగ్ వేదిక"లో చేరబోయే బ్లాగులకు రివ్యూలు రాద్దామని అనుకుంటున్నాను. ఇదంతా కేవలం ఆయా బ్లాగులకు మరింత ప్రచారం కలిపించడం కోసమేనని గమనించగలరు. బ్లాగ్ వేదిక కోసం ఓ మంచి మనసున్న మారాజు కోడ్ ఇస్తానని మాట ఇచ్చారు. ఆయనకు బ్లాగు పూర్వకంగా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. నేను ప్రతిక్షణం తెలుగు బ్లాగుల కోసమే ఆలోచిస్తున్నాను. ఇంకా బ్లాగ్ వేదికను అభివృద్ధి పరచాలంటే ఏమి చెయ్యాలి? ఎటువంటి శీర్షికలు ప్రవేశ పెడితే బాగుంటుంది ఇత్యాది ఎన్నో విషయాలు నా పరిశీలనలో ఉన్నాయి. ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. వాటిజోలికి పోనంతవరకూ తెలుగు బ్లాగులకు ఏవిధమైన ఇబ్బంది ఉండదని నా అభిప్రాయం. నీ అభిప్రాయమేదో నీవు చెప్పు. నీ అభిప్రాయం నచ్చిన వాళ్లు కలుస్తారు. నచ్చని వాళ్లు విమర్శిస్తారు. అటువంటి వారిని వదిలి పెట్టేయి. నీ తప్పులను హుందాగా ఎత్తిచూపించేవారిని మాత్రం దూరం చేసుకోకు. ఆనందంగా స్వీకరించి నీ తప్పులను సరి చేసుకో ఇదే నా పాలసీ! ఇదే నేను ఫాలో అవుతాను. ఇప్పటి వరకూ పెద్దగా నన్ను వ్యతిరేకించినవారు లేరు ఒకరిద్దరు తప్ప! ప్రోత్సాహించినవారు మాత్రం అనేకులు. అయితే "రచ్చబండ" స్థాపించిన తరువాత వ్యతిరేకుల ఉదృతి పెరిగే అవకాశం ఉందనిపిస్తోంది. ఏది,ఏమైనా తెలుగు బ్లాగుల పట్ల నా కృషి విరమించుకునే అవకాశం మాత్రం లేదు.
No comments:
Post a Comment