ఇంతకు ముందు ఈ విషయమై ప్రస్తావించినప్పుడు శ్యామలీయంగారు, శ్రీనివాస్(Who am i)గారు, చైతన్యకుమార్ గారు కొన్ని అభిప్రాయాలు వెలిబుచ్చారు. నాకు ఏవిషయ ప్రాతిపదికపై ఉత్తమ బ్లాగులుగా ఎన్నుకోవాలి అనే విషయంలో కొన్ని ఆలోచనలు కలిగాయి. నిజానికి శ్యామలీయంగారు చెప్పినట్లు తరచు టపాలు వేసినంత మాత్రాన, లేక వివాద విషయాలు వ్రాసి వీక్షకులను ఆకర్షించినంత మాత్రాన మనం ఉత్తమబ్లాగులుగా ఎన్నుకోలేము. ముందు ఏది ఉత్తమ బ్లాగో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. దీని విషయమై నేను కొన్ని ఆలోచనలు చేసాను. దయచేసి మీరు కూడా కొన్ని సలహాలు, సూచనలు తెలియజేస్తే అవ్వన్నీ కలిపి మీ ముందు పెడతాను. అందులోనుండి మంచి నిర్ణయం తీసుకుని 100 ఉత్తమ బ్లాగుల శీర్షికను ప్రారంభిద్దాము. దీనికి మీరెమంటారు?
ముందుగా మీ ఆలోచనలు వ్యక్తం చేయడం ధర్మం అని నా అభిప్రాయం
ReplyDeleteమీ సలహాలు, సూచనలు సేకరించి...నా ఆలోచనలతో అన్నీ మేళవించి ఒక పోస్టు ద్వారా మీ అందరి సమక్షంలో పెట్టి నిర్ణయం తీసుకుంటే మెరుగైన ఫలితం వస్తుందని నా అభిప్రాయం.గమనించగలరు మనోసాక్షిగారు.
Delete