రచ్చబండ...ప్రజ చర్చావేదిక నిర్వాహకులు పల్లా కొండలరావుగారి తొలి ప్రశ్నతో రెడీ అయ్యింది.ప్రియమైన వీక్షకులందరూ ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వండి.రచ్చబండ వేదికను జయప్రదం చేయండి.మీ స్పందనలను బట్టే బ్లాగు మనుగడ సాగుతుంది. మన శ్యామలీయంగారు చెప్పినట్టుగా ఈ చర్చావేదికను చేపల మార్కెట్ కాకుండా చూసుకోవాలని నిర్ణయించాను. అంతేకాదు ఈ రచ్చబండలో అతి లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తాను.ప్రజ బ్లాగు పట్ల వచ్చిన విమర్శలను చూసాను. నిజానికి పల్లా కొండలరావుగారు తెలుగు బ్లాగుల ఉనికి కోసం తన వంతు కృషి చేస్తున్నారు. అది ఏమాత్రం గుర్తించకుండా కేవలం ఆయన పబ్లిసిటీ కోసం నడుపుతున్నారని మాటలాడటం ఎట్టి సమయంలోను సంస్కారవంతం కాదని నా నిశ్చితాభిప్రాయం. ఎంతో సమయాన్ని, వ్యయాన్ని ఖర్చు చేసి పబ్లిసిటీ కోసం నడపడం వలన ఒరిగేది ఏమీ లేదు. ఇటువంటి బ్లాగులను నడపడం వెనుక అసలు ఉద్దేశ్యం కేవలం ఒక అంశం యొక్క పూర్తి విషయాలను తెలుసుకోవడం, తెలియజేయడం అంతే! ఈ విషయాలను గమనిస్తారని కోరుకుంటూ నా బ్లాగు మిత్రులకు స్వాగతం పలుకుతూ ...మీ రచ్చబండ.
Thank you ahmed garu.
ReplyDeleteWelcome sir
Delete