బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు బ్లాగుల అగ్రిగేటర్లను ఆదుకోండి!

      గౌరవనీయులైన తెలుగు బ్లాగర్లందరికీ శుభాభివందనములు
      ఈరోజు మనకి అంతర్జాలంలో తెలుగు బ్లాగుల అగ్రిగేటర్లు ప్రధానంగా మూడే వున్నాయి. 1.కూడలి,2.మాలిక,3.బ్లాగిల్లు.ఇవి కాకుండా కొంతమంది నాలాంటి ఔత్సాహికులు బ్లాగుప్రపంచం,పూదండ,బ్లాగ్ వేదిక లాంటి అగ్రిగేర్లను నిర్వహిస్తున్నారు.
     గతంలో అందరి మన్ననలను పొందిన అగ్రిగేటర్ "హారం" పూసలదండలోని ఒక పూసలా అగ్రిగేర్ల మాలలోంచి విడివడి కనుమరుగయిపోయింది.మొన్నటికి మొన్న దాని నిర్వహణా భారం మోయలేక శ్రీనివాస్ గారు బ్లాగిల్లు ముగించేద్దామనుకుని, తిరిగి తెలుగు బ్లాగుల పట్ల అభిమానం చంపుకోలేక దానిని కష్టనష్టాలకోర్చి నిలబెట్టారు.ఆయనను మనమందరమూ అభినందించాల్సిందే!
    పల్లెప్రపంచం ఓనర్ పల్లా కొండలరావుగారు బ్లాగ్ ప్రపంచం నిర్వహించనని ఇప్పటికే తన బ్లాగు పూర్వకంగా తెలియజేసేసారు. ఇంకా గతంలో ఎంతోమంది ఇప్పటికే ఎన్నో తెలుగు అగ్రిగేర్లను మూసేసారు.దీనికంతటికీ కారణం ఏమిటి?
    నిజానికి ఈ తెలుగు బ్లాగుల అగ్రిగేర్లకు ఏవిధమైన ఆదాయవనరులు లేవు ఆఖరికి నెలవారి అయ్యే ఇంటర్ నెట్ బిల్లు కూడా ఈ అగ్రిగేర్ల వలన రాదు.అయినప్పటికీ తమ వ్యయంతో వీటిని కొనసాగిస్తున్నారు. మరి ఇన్నీ తెలిసిన మనం వారిని పట్టించుకుం టున్నామా? అంటే అదీ లేదు.
    మన బ్లాగులను ఈ అగ్రిగేర్లు ప్రమోట్ చెయ్యకపోతే అంతర్జాలంలో మన బ్లాగులకు ఉనికేలేదు.ఇది పచ్చి నిజం. ఎందుకంటే ఏ అగ్రిగేర్లోను నమోదు చేయని నా బ్లాగు ఒకటి ఒకనెలలో నాలుగంటే నాలుగు క్లిక్ లు మాత్రమే వచ్చాయి. తరువాత ఈ అగ్రిగేర్లలో నమోదు చేయబడిన తరువాత మరు నెలలో 2800 క్లిక్ లు వచ్చి చేరాయి.దీనిని బట్టి మన తెలుగు బ్లాగుల అగ్రిగేర్ల గొప్పతనం మనకు అర్ధమవుతోంది.
    నిజానికి ఈ అగ్రిగేర్లు బ్లాగుకు 1సం//కు ఒక 50రూపాయలో,100రూపాయలో ఫీజు పెడితే బాగుంటుందేమో అనిపిస్తోంది. కాని ఏ ఫీజు లేకుండా చాలా సేవ చేస్తున్నాయి.ఇతర రాష్ట్రాల అగ్రిగేర్లైతే కొంతమొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి.
    ఇంత చేస్తున్న మనం వాటికి ఏమి చేస్తున్నామో చెప్పండి ఏమీ లేదే! ఏవిధంగా వారికి చేయూతనివ్వని మన తెలుగు బ్లాగర్లు కనీసం ఆయా అగ్రిగేర్ల లోగోలను కూడా మన బ్లాగులకు అతికించడం లేదు.కనీసం వారి అగ్రిగేర్ లోగోలను బ్లాగుల్లో పెట్టుకున్నా వారికి కొంత ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని నిoపినవారమవుతాము.మనం వాటి పట్ల అదీ కూడా చేయకపోతే ఈ అగ్రిగేర్ల సేవలను ఉచితంగా పొంది వారికి తీరని అన్యాయం చేస్తున్నట్టే!
    ఎంతోమంది సీనియర్ బ్లాగర్లు కూడా వారికి కనీసం ఈ విధమైన సహకారం అందించడం లేదు. ఇది ఎంత దారుణం. దయచేసి ఇప్పటినుండైనా అగ్రిగేర్లను నిలబెడదాం! వాటి లోగోలను మన బ్లాగులకు అతికించి తెలుగు బ్లాగుల అగ్రిగేర్లందరికీ సెల్యూట్ చేద్దాం!జైహింద్!! 

16 comments:

  1. manchi idea andi....apart from a minoor Fee, emanna "ad" links dwara revenue generate cheyachaa? this might help them a bit as well aggregators

    ReplyDelete
    Replies
    1. సహజసిద్ధంగా యాడ్స్ క్లిక్ చేయాలిగాని, కేవలం అగ్రిగేడర్లకోసం క్లిక్ చేయడం కరెక్ట్ కాదు.స్పందనకు కృతజ్ఞతలు చందుగారు.

      Delete
  2. మీరన్నదినిజమే. సంకలినులకు మనం మరింత ప్రోత్సాహం ఇయ్యవలసి ఉంది. నాబ్లాగుల పేరు కనిపించే సంకలిని లంకె నా బ్లాగుల్లో ఎప్పుడూ ఉంటుంది.

    ReplyDelete
    Replies
    1. తెలుగు అగ్రిగేడర్లకు మీరిస్తున్న ప్రోత్సాహం అభినందించదగ్గదే!మీ తెలుగుబ్లాగులలో బ్లాగ్ వేదికకు కూడా చోటు కలిపిస్తారని ఆశిస్తున్నాను.ముఖ్యంగా స్పందనకు కృతజ్ఞతలు లక్ష్మీదేవిగారు.

      Delete
  3. అవును మీరు చెప్పింది నిజం ,అందుకే నా బ్లాగ్ లో మీ aggrigator link ను ఇప్పుడే పెడ్తున్నాను...

    ReplyDelete
    Replies
    1. మీకు చాలా,చాలా కృతజ్ఞతలు సర్!

      Delete
  4. అగ్రిగేడర్ కాదు - అగ్రిగేటర్ అనాలి కదా!

    మీ బ్లాగ్ వేదిక లోగో ను నా బ్లాగుకి జత చేసాను. తెలుగు బ్లాగుల ఉన్నతికై మీరు పడుతున్న ఆరాటాన్ని కొన్ని నెలలుగా గమనిస్తున్నాను. మీకు అభినందనలు.

    ఇక పోతే మీ ఈ బ్లాగులోని వ్యాపార ప్రకటనలు వైరస్ ఎక్కించేలా వున్నాయి. కొత్త విండోస్ తెరుచుకోవడం, సాఫ్ట్‌వేర్ ఇన్స్టాల్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీ ఈ బ్లాగు తెరవాలంటేనే సంకోచంగా వుంది. ఈ విషయమై శ్రద్ధ తీసుకోగలరు.

    ReplyDelete
    Replies
    1. Pop up యాడ్స్ ఏక్టివ్ చేసి ఉంచడం వలన యాడ్స్ కి సంబంధించిన కొత్త విండో ఓపెన్ అవ్వడం జరుగుతుంది తప్ప ఏవిధమైన వైరస్ కాదు.ఇప్పటినుండి ఆ బాధ కూడా లేకుండా మొత్తం popup యాడ్స్ డిఏక్టివ్ చేసేసాను.ఇక కొత్త విండో ఒపెన్ కాదు.ముఖ్యంగా బ్లాగ్ వేదిక లోగోను మీ బ్లాగుకు జత చేసినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తెలుగు బ్లాగుల ఉన్నతికై నేను చేసే కృషిని గుర్తించినందుకు మరొకసారి ధన్యవాదములు.

      Delete
  5. మీరన్నది అక్షరాలా నిజం. నా బ్లాగ్‌లో మొదటినుంచీ ఆగ్రిగేటర్ల లింక్‌లు ఉన్నాయి.

    ReplyDelete
    Replies
    1. మీ బ్లాగును నేను ఎక్కువుగానే ఫాలో అవుతాను.మీ బ్లాగులో అగ్రిగేటర్ల లింకులను నేను ముందే గమనించాను.బ్లాగు దర్శించినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు సర్!.

      Delete
  6. చాలా మంచి ఆలోచన చౌదరి గారు.

    ReplyDelete
  7. నాకు ఒక బ్లాగు మొదలు పెట్టవలెనని కోరిక . దానికి సంబంధించిన సమాచారం ఎక్కడదోరుకును .

    ReplyDelete
    Replies
    1. బ్లాగ్ ప్రపంచంలోకి స్వాగతం.మీ ఈక్రింది ఈమెయిల్ లో కలవండి.తప్పక నేను పూర్తి సహకారం అందిస్తాను.
      sakshyamgroup@gmail.com

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...