వ్రాసిన టపాలకు తిండి (కామెంట్లు)దొరకక తెలుగు బ్లాగర్లు బాధ పడుతుంటే, మరో ప్రక్క కామెంట్లు ఎక్కువుగా రావడం తట్టుకోలేని వాళ్లు అలాంటి బ్లాగులను నిరోధించాలని గోల పెడుతున్నారు. ఇంకొన్నాళ్లు పోతే ఆన్లైన్ బ్లాగు ప్రపంచంలో ధర్నాయో, నిరాహారదీక్షయో (బ్లాగులకు దూరంగా ఉండడం,భోజనం మానివేయడం మాత్రం కాదు సుమా!) మొదలుపెడతారేమో! ఇవ్వన్నీ చూస్తుంటే ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న తెలుగు బ్లాగుల ప్రపంచానికి మరింతగా నాశనమయ్యే ప్రమాదం ఉందనిపిస్తోంది. పల్లా కొండలరావుగారు ప్రజను దూరం పెట్టడం, శ్యామలీయంగారు దూరంగా ఉంటాననడం ఇవ్వన్నీ రాబోయే తెలుగు బ్లాగుల ప్రపంచానికి సంభవించే విపత్తుకి సూచనగా ఉన్నాయి. నాలాంటి చిన్న బ్లాగర్లు ఇవ్వన్నీ చూస్తూ ఉండగలరా? తట్టుకోగలరా? నా వరకూ అయితే ఎప్పుడూ బ్లాగు ప్రపంచానికి ఏదో అభివృద్ధి చేయాలనే చూస్తున్నాను. ఖాళీ దొరికితే చాలు బ్లాగు ప్రపంచంలోనే గడుపుతున్నాను. అటువంటిది బ్లాగు ప్రమాదం వస్తే ఎలా? ఏది ఏమైనా ఆ ప్రళయాన్ని ఆపే ప్రయత్నం చేస్తాను.మీరు కూడా రండి.తెలుగు బ్లాగుల ప్రపంచాన్ని పునర్మిద్ధాం.
No comments:
Post a Comment