బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ఇక నుండీ "బ్లాగ్ వేదిక" రూల్స్ మార్పు!

ఇంతకు ముందు "బ్లాగ్ వేదిక" లో ఎన్నో ఫీచర్స్ నిర్వహించాలని అనుకునేవాడిని. బాగా డవలప్ చేయాలని అనుకునేవాడిని. కానీ ఒకరకంగా చెప్పాలంటే తెలుగుబ్లాగు ప్రపంచం ప్రోత్సాహం కరువయ్యి పూర్తిగా విరమించుకున్నాను. ఎలాగూ కూడలి,మాలిక,బ్లాగిల్లు ఉన్నవి కదా? వాటి ముందు నా బ్లాగ్ వేదిక ఎంత అనుకుని మిన్నకుండిపోయాను. ఎలాగూ అవి తమ సేవలను అందిస్తూనే ఉన్నాయి కదా! అనుకున్నాను. అయితే ఒక రోజు బ్లాగిల్లు మూతపడింది. (ప్రస్తుతం బ్లాగ్ స్పాట్ లో ఉంది.). ఇప్పుడు అగ్రిగేటర్ లలో నంబర్ వన్ అయిన కూడలి మూతపడిపోయింది. రేపో మాపో మాలిక కూడా మూతపడడం కాయం. ఇక తెలుగు బ్లాగులకు దిక్కేవరు?  అగ్రిగేటర్ లేకపోతే ఒక్క విజిటర్ కూడా బ్లాగుకు రాదు.అది ఎంత గొప్ప బ్లాగయినా? తప్పనిసరిగా అగ్రిగేటర్స్ కావాల్సిందే. ఎంత కాదన్నా మినిమం 10 అగ్రిగేటర్లయినా తెలుగు బ్లాగులకు ఉండాలి. దానిలో భాగంగా "బ్లాగ్ వేదిక"ను పూర్తిగా డవలప్ చేద్దామనుకుంటున్నాను. కఠినమైన నియమాలు తీసుకుందామనుకుంటున్నాను. 
"బ్లాగ్ వేదిక" లో అనుసంధానమైన ప్రతి బ్లాగరు సంవత్సరానికి 50రూపాయలు కట్టాలి.
 స్వంత రాతల బ్లాగులకు తప్ప కాపీ పేస్ట్ బ్లాగులకు అవకాశం లేదు.
బ్లాగ్ వీక్షకుల సూచన మేరకు ఎప్పుడూ TOP 10 బ్లాగులు డిస్ ప్లే అవుతూ ఉంటాయి.
ఇంకా...త్వరలో...
      ఇక పోతే 50 రూపాయలు కట్టి జాయిన్ అవ్వడం వలన ఉపయోగమేమిటి? అని ప్రశ్నిస్తే.. బయట స్క్రిప్ట్ కి 10,000 రూపాయలు పైగా అడుగుతున్నారు. దానితోపాటు డొమైన్ ఖర్చులు, హోస్టింగ్ ఖర్చులు ,మెయింటినెన్స్ ఖర్చులు ఇలా ఎన్నో అగ్రిగేటర్ భరించాల్సి వస్తుంది. ఇవ్వన్నీ ఒకసారితో సరిపోవు. ప్రతి సంవత్సరం అగ్రిగేటర్ భరించాల్సిందే! ఇది ఎంత తెలుగు బాష పట్ల, తెలుగు బ్లాగుల పట్ల గౌరవం ఉన్నా నిత్యం భరించాలంటే కుదురుతుందా చెప్పండి? ఎంత గొప్పవారైనా ఎవరు మోయగలరు? చెప్పండి.? ఈరోజు మూతబడిన అగ్రిగేటర్లన్నీ వాటి నుండి పైసా ఆదాయం లేక, ప్రతి సంవత్సరం ఖర్చులు మోయలేక అంతకంటే ముఖ్యం ఎంతో విలువైన సమయాన్ని (మెయింటైన్ కోసం) తీయలేకే మూతబడిపోయాలి. దానికి తోడు కొంతమంది బ్లాగర్ల దారుణమైన విమర్శలు. ఇవ్వన్నీ భరిస్తూ ఏ అగ్రిగేటర్ కి  మోయాల్సిన అవసరం ఉంది చెప్పండి.?
       నేను కూడా భరించలేను. అందుకనే  బ్లాగ్ వేదికకు చందా నిర్ణయించాను.
      మీరు నడుపుతున్నది బ్లాగ్ స్పాట్ లోనే కదా? దానికి 50రూ|| ఫీజ్ ఎందుకు? కనీసం డొమైన్ కూడా లేదు కదా?
      ఇది మీ ప్రశ్న అయితే ...త్వరలోనే దీనికి డొమైన్ కొంటాను. నేను అనుకున్న టార్గెట్ వరకూ బ్లాగర్ల నుండి ఫీజులు వస్తే స్క్రిఫ్ట్ ,హోస్టింగ్ కూడా తీసుకుంటాను. అప్పటి వరకూ బ్లాగ్ లోనే కొనసాగుతాను. డొమైన్ మాత్రం యాడ్ అవుతుంది. ఎందుకంటే రేపు హోస్టింగ్ కి మారినా URL మారకూడదు కాబట్టి. ఇప్పుడు బ్లాగ్ వేదిక లుక్ కూడా పూర్తిగా మారిపోయింది ఇంకా మారుతుంది. కుడి ప్రక్కా 100బ్లాగులు,ఎడం పక్కా 100బ్లాగులు రీసెంటివి ప్రదర్శించబడతాయి. ఒకసారి చూసి సలహాలు ఇవ్వండి స్వీకరిస్తాను. ఇప్పుడు చెప్పండి నాప్రయత్నం బాగుందా? బ్లాగర్ల ప్రోత్సాహం లభిస్తుందా?
     

11 comments:

 1. Replies
  1. ముందుగా మీకు కృతజ్ఞతలు శర్మగారు. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ ప్రోత్సాహానికి ధన్యుడిని. అతి త్వరలో వివరాలన్నీ తెలియజేస్తాను సర్. అంతవరకూ ఓపిక పట్టండి.

   Delete
 2. రేపో మాపో మాలిక కూడా మూతపడడం కాయం.
  ----------------------------------------------------------

  You seem to be so sure :)

  ReplyDelete
  Replies
  1. భరద్వాజ గారు,

   ఇంత షాక్ ఇవ్వమాకండి ! మాలిక ని నమ్మి బ్లాగుతున్నాం ! శరణం వ్రజ !

   జిలేబి

   Delete
  2. ముందుగా మాలిక యాజమాన్యమయిన భరద్వాజ్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మాలిక కలకాలం ఉండాలని కోరుకునే వాళ్ళలో నేను ఎప్పుడూ ముందు వరసలోనే ఉంటాను. నేడు జరుగుతున్నా అగ్రిగేటర్ల సమస్యలపై బ్లాగు పాఠకుల స్పందనకు ప్రేరణ కలిగించడానికై అలా వ్రాసాను. క్షమించగలరు.

   Delete
 3. Replies
  1. నూతన సంవత్సర శుభాకాంక్షలు సర్. అతి త్వరలో అన్నీ వివరాలు తెలుపుతాను.దయచేసి కొద్దిగా ఓపిక పట్టండి. మీ ప్రత్సాహానికి కృతజ్ఞతలు సర్.

   Delete
 4. అగ్రిగేటర్ లేకపోతే ఒక్క విజిటర్ కూడా బ్లాగుకు రాదు.అది ఎంత గొప్ప బ్లాగయినా?
  వస్తారు ...తప్పకుండా వస్తారు. (తొక్కలో) ఆగ్రిగ్రేటర్లని నమ్ముకునే బ్లాగర్లు బ్రతుకుతారా ? అమితాబ్ బచ్చన్ బ్లాగ్, అద్వానీ బ్లాగ్ కి అగ్రిగ్రేటర్ల అవసరం ఉందా ?

  ReplyDelete
  Replies
  1. మేడమ్ నీహారికగారు.. మీకు అగ్రిగేటర్లు "తొక్క"లో వాళ్లే కావచ్చు. కానీ తెలుగు బ్లాగులు నలుగురి వద్దకు చేరాలంటే అగ్రిగేటర్ల అవసరం 100% అవసరం ఉంది.ఇప్పటికే కూడలి ప్రభావం చాలా వరకు తెలుగు బ్లాగులపై పడింది.

   Delete
 5. నేను కూడా భరించలేను. అందుకనే బ్లాగ్ వేదికకు చందా నిర్ణయించాను.

  haribabu:
  నేను ఎప్పట్నించో యాగ్రిగేటర్లు నడుపుతున్నవారికి ఇవ్వాలనుకుంటున్న సూచన.మీరు ధైర్యం చేసి ముందుకొచ్చారు.మీరన్నట్టు సంవత్సరానికి యాభై రూపాయలు అసలు లెఖ్ఖలోకే రాదు!

  ఇత కష్తం భరించి ఇంత ఆదరన కల్పిస్తున్నందుకు మెయింటెనెన్స్ ఖర్చూల నయినా తీసుకోకపోవడం అతి మంచితనమే.

  అతి సర్వత్ర వర్జయేత్!

  ReplyDelete
 6. మంచి ప్రయత్నం, ఔత్సాహిక బ్లాగర్లకు అగ్రిగేటర్ల ఉపయోగం ఎంతో వుంది. ఇప్పుడు బాగా పాపులర్ అయిన బ్లాగులని నేను అప్పట్లో కూడలి వల్లనే సందర్శించగలిగాను.

  ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...