కూడలి మూత పడుతుందని ఎవరూ ఊహించనేలేదు. కొత్త సంవత్సరం సెలబ్రేట్స్ చేసుకోకుండానే ఓ పవర్ ఫుల్ అగ్రిగేడర్ కనుమరుగయ్యిపోయింది. ఇంతకు ముందే సంకలిని,హారం మూతబడ్డాయి. ఇప్పుడు కూడలి లేకుండా పోయి తెలుగు బ్లాగుల ప్రపంచానికి విషాదాన్ని మిగిలించింది. కూడలి నుండి వచ్చినంతగా విజిటర్స్ మరే అగ్రిగేటర్ నుండి రారు. ఈవిషయంలో కూడలిని దాటుకుని ఎవరూ ముందుకు పోలేకపోయారు. ఈమధ్య కామెంటర్ల పద్ధతి కూడా అస్సలు బాగులేదు. బూతులు తిట్టుకుంటున్నారు. అతి దారుణంగా విమర్శించుకుంటున్నారు. మంచి టపాల కంటే సంబంధం లేని బూతు కామెంట్లే బ్లాగర్లకు మనస్సును నొప్పిస్తున్నాయి. ఇలా ఉంటే తెలుగు బ్లాగుల ప్రపంచం అంతమయ్యిపోయినట్టే! మొత్తానికి మనమందరమూ కల్సీ కూడలికి కృతజ్ఞలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కూడలి చేసిన సేవలు మరవదగ్గనివి.
No comments:
Post a Comment