బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు బ్లాగుల ప్రపంచాన్ని నాశనం చేస్తున్నది ఎవరు?

ఈమధ్య బ్లాగులలో కొంతమంది రెచ్చిపోయి విపరీతమైన కామెంట్లు పెడుతూ ఆయా బ్లాగర్లకు విపరీతమైన చికాకు తెప్పించి బ్లాగు లోకంనుండి విరమించుకునేలా చేస్తున్నారు. ఇంతదారుణం మరొకటి ఉందా? ఇది కొంతమందికి సరదా కావచ్చు. కానీ కొంతమందికి చాలా బాధ కలిగిస్తుంది.వారు నచ్చిన బ్లాగులను, టపాలను చదివేవారు కావడం చేత ఒళ్ళుమండి ఈక్రింది విధంగా కామెంట్లు పెడుతున్నారు. ఎలాగైనా వీళ్ళ బెడద వదిలించాలని చూస్తున్నారు. దానికి ఉదాహరణే ఈ క్రింది కామెంట్ ఎవరో ఆ అరవింద్ గారు ఎక్కువుగా నా బ్లాగులను, మరికొన్ని బ్లాగులను ఆయన ఫాలో అవుతుంటారు. ఒకరి మీద ఒళ్ళుమండి ఈ కామెంట్ పెట్టిండు. ఒకసారి మీరు కూడా చూడండి. క్రింద లింక్ ఇస్తున్నాను.
ఇలా ఒకరికొకరు విమర్శించుకోవడం ఏమి బాగోలేదు. దయచేసి ఎవరి బ్లాగులు వాళ్ళు వ్రాసుకుంటే మంచిది. నచ్చినవి చదవొచ్చు. ఆటపాలలో ఉన్న లోపాలను అక్కడికక్కడే సూచిస్తే బాగుంటుంది గాని తమ బ్లాగులలో ఆయా బ్లాగర్లను విమర్శించడం సంస్కారం కాదని మనవి.

4 comments:

  1. తెలుగు బ్లాగుల ప్రపంచాన్ని నాశనం చేసేది ఖచ్చితం గా తెలుగు బ్లాగు ల అగ్రిగేటర్ లైన బ్లాగ్ వేదిక, మాలిక, కూడలి గట్రా అగ్రిగేటర్ లే ! వాళ్ళు కామింటులని ప్రచురిస్తూ అగ్గి కి ఆజ్యం పోస్తున్నారు అని నా ప్రగాఢ విశ్వాసం :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబి గారూ ! ఆఖరుకు నా అభిప్రాయంతో ఏకీభావించారన్నమాట...

      Delete
    2. ఇంకెవరు... జిలేబీ,నీహారిక గార్లే! కామెంట్లతో జిలేబీ రెచ్చగొడుతుంటే, తొక్కలో కబుర్లంటూ నీహారిక దూషిస్తుంది.వీరిద్దరి దెబ్బకు మీ బ్లాగ్ లోకం అల్లలాడుతుంది సోదరా!

      Delete
  2. జిలేబీ గారూ!మీరు చెప్పింది ఒకరకంగా సరైన విషయమే. కొంతకాలం పాటు ఈ అగ్రిగేటర్లు తమ కామెంట్ల సెక్షన్ తొలగించి చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మరొక ముఖ్య విషయమేమిటంటే బ్లాగ్ వేదికలో కామెంట్ల సెక్షన్ లేదు. ఇది కేవలం బ్లాగ్ విడ్జెట్లతో తయారు చేసిన ఒక బ్లాగ్ అగ్రిగేటర్ మాత్రమే తప్ప కూడలి,మాలిక,బ్లాగిల్లు స్థాయి దీనికేమాత్రము లేదు.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...