బెగ్గర్ ఫ్రీ సిటీ గా హైదరాబాద్ ... సాధ్యమయ్యేనా? |
బెగ్గర్ ఫ్రీ సిటీ గా హైదరాబాద్ ... సాధ్యమయ్యేనా?
భారతదేశం ...ప్రపంచపటంలో మన ఈ దేశానికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు ఆచార వ్యవహారాలకు కట్టుబాట్లకు ప్రపంచం మొత్తం దాసోహం అంటుంది. కానీ దేశంలో కటిక పేదరికంలో బ్రతికేవారు కూడా లక్షల్లో ఉన్నారు. అన్నపూర్ణగా పిలిచే దేశంలో పట్టెడు అన్నం కోసం దేహి అంటూ యాచించే వారు చాలామంది ఉన్నారు. రోజురోజుకి ఇలాంటివారు దేశంలో పెరిగిపోతున్నారు. దీనితో కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.దేశంలో ఏ కూడలి వద్ద చూసినా యాచకులు కనిపిస్తుంటారు. ఇక ఈ యాచన వృత్తికి స్వస్తి చెప్పి వారికి ఏదో ఒక రకంగా పునరావాసం ఉపాధి కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది . ఇక ఈ కొత్త ప్రాజెక్ట్ అమలుకు హైదరాబాద్ ను ఎంచుకుంది కేంద్రం. హైదరాబాద్ లో రద్దీగా ఉండే సిగ్నల్స్ వద్ద దేవాలయాల వద్ద ప్రముఖ పర్యాటక కేంద్రాల వద్ద విపరీతంగా యాచకులు కనిపిస్తుంటారు. హైదరాబాద్ ను యాచక రహిత నగరంగా (బెగ్గర్ ఫ్రీ సిటీ గా) మార్చాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం మొదటగా హైదరాబాద్ నుంచి ఈ ప్రాజెక్ట్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇందులో భాగంగానే ..బెగ్గర్ ఫ్రీ నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దేలా జీహెచ్ఎంసీ కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకుగాను బిక్షగాళ్ల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఏడు అంశాలను తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు.