బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

కామెంట్ల సెట్టింగ్స్ నుండి Anonymous తొలగిస్తే సభ్యత కలిగిన వ్యాఖ్యలు వస్తాయా?

కొంతమంది Anonymous ద్వారా అసభ్యత కలిగిన వ్యాఖ్యలు చేస్తూ బ్లాగర్లను కించపరచటమూ, రెచ్చ గొట్టడమూ చేస్తూ చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మరికొంతమంది అతి తెలివి బ్లాగర్లు తమ టపాలకు తామే Anonymous కామెంట్లు చేసుకుంటూ మరింత వివాదాలను సృష్టిస్తున్నారు.

ఇంకా మరికొంతమంది సన్నాసులున్నారు. తమకు వ్యక్తిగతంగా ఉన్న పరిచయమున్న మిత్రుల యొక్క బ్లాగులలో Anonymous పేరు మీద విమర్శాత్మక, దూషణకరమైన లేక అవమాన పరిచే ధోరణిలో కామెంట్లు చేస్తూ చాలా దారుణంగా బాధకు గురిచేస్తున్నారు. వీరికి రెండు,మూడు ఐడిలు ఉంటున్నాయి.

కాబట్టి ఇటువంటి పరిస్థితులలో Anonymous ను కామెంట్ల సెక్షన్ ను బ్లాగర్ల సెట్టింగ్స్ నుండి తొలగిస్తే కొంతవరకైనా మంచి,మంచి పోత్సాహక కామెంట్లకు స్థానాన్ని కలిపించినవారమవ్వుతాము. దీనికి మీరేమంటారు?

If an unauthorized removal from the comments settings will come with comments from member states?

తెలుగు బ్లాగర్ దంతులూరి కిషోర్ వర్మ గారేమైపోయారు?

"మనకాకినాడలో" తెలుగు బ్లాగు ఈమధ్య అగ్రిగేటర్ లో కనిపించడం లేదు. ఆ బ్లాగ్ అప్డేట్ జరిగి చాలా కాలం కూడా అయ్యిపోయింది. ఇందులో ఎక్కువుగా కాకినాడను గూర్చిన సమాచారం లభించేది.

దంతులూరి కిషోర్ వర్మ  మంచి,మంచి రచనలతో పాటు ఎన్నో విశేషాలు అందించేవారు. ఇది చదవడానికి వీక్షకులకు ఎంతో సౌకర్యంగా ఉండడంతో పాటు ఇంట్రస్ట్ గా ఉండేది.

దయచేసి మన దంతులూరి కిషోర్ వర్మ గారిని మళ్ళీ తెలుగు బ్లాగుల ప్రపంచానికి తిరిగి రావాల్సిందిగా బ్లాగ్ వేదిక తరుపున కోరుచున్నాము.

తెలుగు బ్లాగుల ప్రభావం చాలా వరకూ తగ్గిపోయింది.కారణం?

ఈ మధ్య తెలుగు బ్లాగుల విజిటింగ్ పూర్తిగా తగ్గిపోయింది.తెలుగు అగ్రిగేడర్ లను చాలా వరకూ చూడడమే మానివేశారు. అత్యధిక బ్లాగర్లు ఈమధ్య బ్లాగులను వ్రాయడమే మానుకున్నారు. ఎందుకిలా జరుగుతుందో అర్ధమై చావడం లేదు.మళ్ళీ తెలుగు బ్లాగుల వైభవం వస్తుందా? దాని కోసం మనం ఏమి చేయాలో చెప్పగలరా?

తెలుగు బ్లాగుల అభివృద్ధి కొరకు మనం ఏమి చేయాలి?

గతకాలంలో ఒకరికొకరు దారుణంగా విమర్శించుకోవడం వలన తెలుగు బ్లాగర్లు విసిగి చెంది తమ బ్లాగులను మూసివేశారని కొంతమంది వాదన. కొంతమందేమో మంచి విషయాలు కలిగిన తపాలే లేవు కేవలం సినిమాల గురించి, షికార్ల గురించి తప్ప మరికొందరి వాదన. మరీ కొంతమందైతే "ప్రజ" ,"రచ్చబండ" లాంటి చర్చా బ్లాగుల వల్లే ఒకరిపట్ల,మరొకరు తిట్టుకోవడాలు,దారుణంగా విమర్శించుకోవడాలు చేస్తున్నారు. ఎలాగైనా వీటిని మూసివేస్తేనే ప్రయోజనమని వాదన. ఇలా రకరకాలుగా వాదనలున్నాయి. ఏది ఏమైతేనే మొత్తానికి తెలుగు బ్లాగుల ప్రాబల్యం తగ్గిపోతుంది. ఇటువంటి పరిస్థితులలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అభివృద్ధి కొరకు మనం ఏమి చేయాలి?

What do we do for development of Telugu blogs?

"పల్లె ప్రపంచం" కొండలరావు గారు బ్లాగ్ లోకానికి తిరిగి వచ్చినందుకు సంతోషం.

ప్రజా చర్చావేదికతో ఉర్రూతలూగించిన పల్లా కొండలరావుగారు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. అంతంతమాత్రమే నుడుస్తున్న బ్లాగ్ లోకానికి నిహారికా గారిలాంటి తెలుగు బ్లాగర్లందరూ తిరిగి వచ్చేస్తే చాలా బాగుంటుంది. మన తెలుగు బ్లాగులలోకానికి పూర్వపు వైభవం తిరిగి తెచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.
హాయ్ కొండలరావుగారూ బ్లాగ్ వేదిక తరుపున మీకు స్వాగతం...సుస్వాగతం. మీ చౌదరి- Sakshyam Magazine.

ప్రముఖ బ్లాగ్ కామెంటర్ జిలేబీ గారు ఏమైపోయారు?

ఎవరు టపా వ్రాసిన టపా...టపా...టపా మని శతకాలన్నీమిక్సీ లో వేసి అన్నీ బాగా కలిసిన తరువాత తీసిన పద్యాలతో ఊదరగొట్టే మన జిలేబీ మేడం గారు ఏమైపోయారు? అసలే తెలుగు బ్లాగుల ప్రపంచం అంత మాత్రంగానే మిగిలియున్న ప్రస్తుత తరుణంలో జిలేబీ గారిలాంటి సంచలన కామెంటర్ మాయమయ్యిపోవడం చాలా ఆశ్చర్యంగానూ, ఆందోళనగానూ ఉంది.

ఈమధ్య ఒక బ్లాగ్ కామెంటర్ ఎవరో జిలేబీ ఇక లేరు అని పెట్టాడు. అది చదివిన వెంటనే దిగ్భ్రాంతికి గురైపోయాను. నిజమేనా? ఆమె ఎందుకు రావడం లేదు? నిజంగానే (బ్లాగ్)లోకంనుండే నిష్క్రమించిందా? జిలేబీ గారితో దగ్గరి సంబంధం ఉన్న వారెవరైనా వివరాలు తెలుసుకుంటే బాగుంటుంది.

సహజంగా బ్లాగర్లకు ఇతర బ్లాగర్లతోనూ సంబంధం ఏర్పడుతుంది. ముఖ పరిచయం ఉండనప్పటికీ బ్లాగ్ పరంగా ఆయా బ్లాగర్లతో కామెంట్ రూపంలోనో లేక పోస్టుల రూపంలోనో పరిచయ సంబంధం ఏర్పడుతుంది.కొంతకాలం పాటు బ్లాగులలో బాగా తిరిగిన వ్యక్తులు ఒక్కసారే బ్లాగు ప్రపంచంలో కనిపించడం మానివేస్తే రకరకాల సందేహాలు వచ్చి బాధకు గురవుతాము. అసలు వాళ్ళు ఏమైపోయారు? ఉన్నారా? లేరా? ఇటువంటి సందేహాలు వస్తాయి. నిజానికి ఒకప్పుడు పల్లె ప్రపంచం పేరుతో పల్లా కొండలరావు ఉండేవారు. ఇప్పుడాయన బ్లాగులోకంలో కనిపించడమే మానివేశారు. అయితే ఆయన తన బ్లాగులో ఇచ్చిన ఫోన్ నంబర్, అడ్రస్ లేక మెయిల్ ఆయనను డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి యోగ క్షేమాలు అడిగే అవకాశం కలిగించాయి. దీనిని బట్టి చూస్తే ప్రతి బ్లాగర్ తన బ్లాగులో తన గూర్చిన వివరాలు పొందుపర్చితే బాగుంతున్దనిపిస్తోంది.దీనికి మీరేమంటారు? జిలేబీ గారి విషయంలో జరుగుతున్న గందరగోళం మన విషయంలోనూ కలుగదు కదా?
Related Posts Plugin for WordPress, Blogger...