తెలుగు బ్లాగుల ప్రభావం చాలా వరకూ తగ్గిపోయింది.కారణం?

ఈ మధ్య తెలుగు బ్లాగుల విజిటింగ్ పూర్తిగా తగ్గిపోయింది.తెలుగు అగ్రిగేడర్ లను చాలా వరకూ చూడడమే మానివేశారు. అత్యధిక బ్లాగర్లు ఈమధ్య బ్లాగులను వ్రాయడమే మానుకున్నారు. ఎందుకిలా జరుగుతుందో అర్ధమై చావడం లేదు.మళ్ళీ తెలుగు బ్లాగుల వైభవం వస్తుందా? దాని కోసం మనం ఏమి చేయాలో చెప్పగలరా?

2 comments:

  1. ఎన్నో‌సార్లు ఈ‌విషయమై విచారవ్యక్తీకరణలూ, సమస్యాపరిశీలనాప్రయత్నాలూ, పునర్వైభవప్రాప్తికోసం ఆచరణీయమార్గాన్వేషణలూ, వివిధప్రయత్నాలూ వంటివి జరిగాయి. కానీ‌ నానాటికీతీసికట్టు నాగంభొట్లు అన్నతీరుగా ఉంది పరిస్థితి. ప్రస్తుతం బ్లాగుల్లో అతికొద్దిబ్లాగుల్లో తప్ప విషయం‌ ఏమీ ఉండటం‌ లేదు. విషయం లేని బ్లాగుప్రపంచం‌ పట్ల చదువరులకు ఆసక్తిలేదు. ఎవరూ చదవని బ్లాగుల్ని వ్రాయాలనీ కాస్త నిబధ్దతతో వ్రాసే బ్లాగర్లకు ఆట్టే అసక్తి లేదు. సోది బ్లాగులతో‌ మనం అనుబంధం ఎలా పెంచుకుంటాం - అవలా తయరైపోతున్నప్పుడు తప్పనిసరై త్రుంచుకుంటాం కాని? తమప్రపంచంలో‌ తాము జీవించే శంకరాభరణం పద్యక్రీడనులు మాత్రమే ప్రస్తుతం‌ అగ్రిగేటర్లలో వ్యాఖ్యల పేజీ(ల)కి మహారాజపోషకులు. మరొక ఒకటి రెండేళ్ళ తరువాత అగ్రిగేటర్ల అవసరం పూర్తిగా తీరిపోతుందని అనిపిస్తోంది.

    ReplyDelete
    Replies
    1. ఇప్పటికే చాలా వరకూ అగ్రిగేడర్ ల ప్రభావం తగ్గిపోయింది. మీరన్నట్టు త్వరలోనే అగ్రిగేటర్ల అవసరం తీరిపోవడం ఖాయం.ఇప్పటికే మాలిక తప్ప ప్రముఖ అగ్రిగేటర్లన్నీ కాలగర్భంలో కలసిపోయాయి.

      Delete

..poodanda.Blogillu లేఖిని (Lekhini): Type in Telugu మాలిక: Telugu Blogs