బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ప్రముఖ బ్లాగ్ కామెంటర్ జిలేబీ గారు ఏమైపోయారు?

ఎవరు టపా వ్రాసిన టపా...టపా...టపా మని శతకాలన్నీమిక్సీ లో వేసి అన్నీ బాగా కలిసిన తరువాత తీసిన పద్యాలతో ఊదరగొట్టే మన జిలేబీ మేడం గారు ఏమైపోయారు? అసలే తెలుగు బ్లాగుల ప్రపంచం అంత మాత్రంగానే మిగిలియున్న ప్రస్తుత తరుణంలో జిలేబీ గారిలాంటి సంచలన కామెంటర్ మాయమయ్యిపోవడం చాలా ఆశ్చర్యంగానూ, ఆందోళనగానూ ఉంది.

ఈమధ్య ఒక బ్లాగ్ కామెంటర్ ఎవరో జిలేబీ ఇక లేరు అని పెట్టాడు. అది చదివిన వెంటనే దిగ్భ్రాంతికి గురైపోయాను. నిజమేనా? ఆమె ఎందుకు రావడం లేదు? నిజంగానే (బ్లాగ్)లోకంనుండే నిష్క్రమించిందా? జిలేబీ గారితో దగ్గరి సంబంధం ఉన్న వారెవరైనా వివరాలు తెలుసుకుంటే బాగుంటుంది.

సహజంగా బ్లాగర్లకు ఇతర బ్లాగర్లతోనూ సంబంధం ఏర్పడుతుంది. ముఖ పరిచయం ఉండనప్పటికీ బ్లాగ్ పరంగా ఆయా బ్లాగర్లతో కామెంట్ రూపంలోనో లేక పోస్టుల రూపంలోనో పరిచయ సంబంధం ఏర్పడుతుంది.కొంతకాలం పాటు బ్లాగులలో బాగా తిరిగిన వ్యక్తులు ఒక్కసారే బ్లాగు ప్రపంచంలో కనిపించడం మానివేస్తే రకరకాల సందేహాలు వచ్చి బాధకు గురవుతాము. అసలు వాళ్ళు ఏమైపోయారు? ఉన్నారా? లేరా? ఇటువంటి సందేహాలు వస్తాయి. నిజానికి ఒకప్పుడు పల్లె ప్రపంచం పేరుతో పల్లా కొండలరావు ఉండేవారు. ఇప్పుడాయన బ్లాగులోకంలో కనిపించడమే మానివేశారు. అయితే ఆయన తన బ్లాగులో ఇచ్చిన ఫోన్ నంబర్, అడ్రస్ లేక మెయిల్ ఆయనను డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి యోగ క్షేమాలు అడిగే అవకాశం కలిగించాయి. దీనిని బట్టి చూస్తే ప్రతి బ్లాగర్ తన బ్లాగులో తన గూర్చిన వివరాలు పొందుపర్చితే బాగుంతున్దనిపిస్తోంది.దీనికి మీరేమంటారు? జిలేబీ గారి విషయంలో జరుగుతున్న గందరగోళం మన విషయంలోనూ కలుగదు కదా?

3 comments:

  1. పోనీలెండి. ఎక్కడో అక్కడ విశ్రాంతి తీసుకుంటుంటారు. మనకి అర్థం కాని పద్యాల గొడవ తగ్గింది.

    ReplyDelete
  2. కొండలరావు గారు ఒక పత్రికను నడుపుతున్నారండీ. ఆయనకు తీరిక ఉండక బ్లాగులకు దూరంగా ఉన్నారని భావిస్తున్నాను.

    అందరూ తమ వ్యక్తిగత వివరాలను బహిరంగంగా ప్రదర్శించుకోవటానికి ఇష్టపడకపోవచ్చును కదండీ. ఐతే బ్లాగర్లు తమ వివరాలను ఆచితూచి ఆప్తులని భావించిన కొందరు బ్లాగర్లతో వివరాలను పంచుకొంటే చాలును. గందరగోళాలకు ఆస్కారం తగ్గుతుంది.

    ReplyDelete
    Replies
    1. కొండల రావు గారు తాను "పల్లె ప్రపంచం" పేరుతొ ఒక ప్రభుత్వేతర సంస్థ నడుపుతున్నానని గతంలో చెప్పారు. ఈ సంస్థ సామాజిక కార్యకలాపాల గురించి కూడా వారు అప్పుడప్పుడు బ్లాగులో రాసారు. ఉ. చెరువుల పునరుద్దీకరణపై గ్రామాలలో అవగాహనా సదస్సులు జరిపారు.

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...