బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Showing posts with label Political news. Show all posts
Showing posts with label Political news. Show all posts

మహారాష్ట్ర - హర్యానా ఎన్నికలతో జమిలి ఎన్నికల ఊహాగానాలకు తెరపడినట్టే!

No-Hopes-On-Jamili-Elections-After-Haryana-Assembly-Elections-Blogvedika-News
జమిలి ఎన్నికల ఊహాగానాలకు తెరపడినట్టే! : 2019 ఎలక్షన్లలో మోడీ ప్రభుత్వం బంపర్ మెజారిటీతో అధికారంలోకి రాగానే.. మూడేళ్లలోనే ఎన్నికలు ఉంటాయంటూ ఒక ప్రచారమ మొదలైంది. దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ - లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు  నిర్వహించాలని బి‌జే‌పి పార్టీ వాళ్లు ముచ్చటపడుతూ వచ్చారు. దీనికి జమిలి ఎన్నికలంటూ పేరు కూడా పెట్టారు. ప్రత్యేకించి ప్రధాని మోడీ-హోమ్ మంత్రి అమిత్ షాలకు ఆ ఆసక్తి చాలా ఉందని స్పష్టం అయ్యింది. అయితే దీంతో అవిగో.. ఇవిగో.. ఎన్నికలంటూ హడావుడి మొదలైంది. ఏపీలో కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్లు మూడేళ్లలో ఎన్నికలు వచ్చేస్తాయంటూ ప్రచారం మొదలుపెట్టారు.

అయితే కొన్నాళ్లుగా అందుకు సంబంధించి హడావుడి లేదు. మోడీ-అమిత్ షా ద్వయం కూడా అందుకు సంబంధించి మంత్రాంగం సాగిస్తున్న దాఖలాలు లేవు. ఆ సంగతలా ఉంటే.. మహారాష్ట్ర - హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తీరును గమనించాకా.. ఇప్పట్లో మోడీ ప్రభుత్వం ఎన్నికలంటూ హడావుడి చేసే అవకాశాలు తగ్గిపోయాయి.

అమిత్ షా సంచలన వ్యాఖ్యలు.. తప్పంతా భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూదేనట!

Central-home-minister-Amit-Shah-Targets-Opposition-On-Jammu-and-Kashmir
జమ్ము కశ్మీర్ ఇప్పటికీ సమస్యగానే మిగిలిపోవడం - అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు సాగడం - చివరకు కశ్మీర్ లోని కొంత భూభాగాన్ని పాక్ ఆక్రమించడం... వీటన్నింటికీ కారణమేమిటో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగానే కాకుండా కేంద్ర హోం మంత్రిగా కొనసాగుతున్న అమిత్ షా చెప్పేశారు. వీటన్నింటికీ మాజీ ప్రధాని - భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూనేనని ఆయన తేల్చి పారశారు. నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు - నాడు హోం మంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ న సంప్రదించకుండానే ఏకపక్షంగా వ్యవహరించిన తీరు కారణంగానే కశ్మీర్ సమస్య నేటికీ సమస్యగానే మిగిలిపోయిందని కూడా అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు నెహ్రూ చేసిన తప్పుల కారణంగానే నేటికీ కశ్మీర్ రావణ కాష్టంగా మండిపోయిందని కూడా షా వ్యాఖ్యానించారు.

బీజేపీ సైద్ధాంతిక కర్త ఆరెస్సెస్ భేటీకి హాజరైన సందర్భంగా అమిత్ షా ఆదివారం ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత తొలి ప్రధానినే తప్పుబట్టడం అంటే మాటలు కాదు కదా. అందుకేనేమో అమిత్ షా కూడా కాస్తంత క్లారిటీగానే అంశాల వారిగానే నెహ్రూ తప్పులను ఎత్తి చూపించారు. షా చెప్పిన నెహ్రూ తప్పులు ఏమిటన్న విషయానికి వస్తే... కశ్మీర్ అంశంపై నెహ్రూ ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించడమే పెద్ద తప్పని అమిత్ షా ఆరోపించారు. అంతేకాకుండా కశ్మీర్ విషయం పట్ల నెహ్రూ ఎంచుకున్న చార్టర్ కూడా పొరపాటేనని కూడా అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో నెహ్రూ చార్టర్ 35ను ఎంచుకున్నారని ఇది ముమ్మాటికీ తప్పేనని చెప్పేసిన షా... చార్టర్ 35కు బదులుగా చార్టర్ 51ని ఎంచుకుని ఉంటే బాగుండేదని కూడా చెప్పారు.

ఇక నుంచి తెలుగు ప్రజల ఆంధ్రా బ్యాంకు అడ్రెస్ గల్లంతు! - కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

Centeral-minister-Nirmala-Sitharaman-Decision-Effect-on-Andhra-bank-blog-vedika
ఆంధ్రా బ్యాంకు... ఈ పేరు వినగానే తెలుగు ప్రజలు తమ సొంత బ్యాంకుగా పరిగణిస్తారు. ఆంధ్రా బ్యాంకు శాఖకు వెళితే.. తమ బ్యాంకులోకి అడుగుపెట్టినట్టే ప్రతి తెలుగోడూ భావిస్తాడు. అలాంటి ఆంధ్రా బ్యాంకు ఇకపై కనబడదు. తెలుగోడి గుండె పగిలే ఈ వార్త ఎవరి నోటి నుంచి వచ్చిందో తెలుసా? ఆంధ్రా కోడలైన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నోటి నుంచే ఈ వార్త వినాల్సి రావడం నిజంగా దురదృష్టకరమే. ఏం చేస్తాం మరి... తెలుగింటి కోడలు దేశ రాజధానిలో మీడియా సమావేశం పెట్టి మరి తన అత్తారింటి బ్యాంకుగా పేరుగాంచిన ఆంధ్రా బ్యాంకును ఇంకో బ్యాంకులో విలీనం చేస్తున్నామని - ఇకపై ఆంధ్రా బ్యాంకు పేరు వినిపించడని ఏమాత్రం సంకోచం లేకుండానే చెప్పేశారు.

అయినా తెలుగింటి కోడలు అయినా - ఆంధ్రా కోడలుగా మనం పిలుచుకున్నా... తన సొంత రాష్ట్రం - తన పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాలపై శీతకన్నేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్నా... తన అత్తారింటికి జరుగుతున్న అన్యాయాన్ని ఆపడం సాధ్యం కాదు కదా. ఏపీలోని కీలక జిల్లా - రాజకీయంగా మంచి పరిణతి కనిపించే జిల్లాగా పేరున్న కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య... ఎఫ్పుడో స్వాతంత్య్రానికి పూర్వమే 1923 నవంబర్ 20న కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఆంధ్రా బ్యాంకును ప్రారంభించారు.

జగన్ కు వ్యక్తిగత కక్షలు అవసరమా?

జగన్ కు వ్యక్తిగత కక్షలు అవసరమా?
జగన్ కు వ్యక్తిగత కక్షలు అవసరమా?
మాజీ సియం చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని జగన్ పాల్పడుతున్న దాడులకు ప్రజలు గట్టి సమాధానం చెప్తారన్న విషయం వైసిపి వారు గమనిస్తే మంచిది. ఎందుకంటే మన సియం జగన్ యుక్త వయస్సు కలవాడు. ప్రస్తుత జనరేషన్ కలవాడు కాబట్టి అతని ఆలోచనలు కూడా చురుకుగానే పనిచేస్తాయి. అవన్నీ ఆంధ్రా అభివృద్ధిపై పెడితే బాగుంటుంది. నిజానికి వెనుకుండి చక్కని దారి చూపే సీనియర్ నాయకులు అతనికి కావాలి. కానీ అటువంటి ఆలోచనలు ఉన్న నాయకులెవరూ వైయస్సార్ పార్టీలో కనిపించడం లేదు. రోజా, అంబటి, అనిల్ కుమార్ యాదవ్ లాంటి కొత్త లీడర్లు నోరేసుకు పడిపోవడం తప్ప వీళ్ళు ఊడబెరికేది ఏదీ లేదు. వీళ్ళందరూ అది కూల్చేస్తాం... ఇది కూల్చేస్తాం అంటుంటే రాష్ట్ర ప్రజలకు ఆగ్రహం కలుగుతోంది. జగన్ చంద్రబాబు పట్ల వ్యహరిస్తోన్న తీరు నచ్చడం లేదు. ఎందుకంటే చంద్రబాబు అంటే సామాన్యమైన వ్యక్తేమీ కాదు. ఆంధ్రాకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా పేరున్న నాయకుడు. అటువంటి చంద్రబాబు పట్ల జగన్ గౌరవ తీరు ప్రదర్శిస్తే ఆ హుందాతనం జగన్ కు బంగార కిరీటమయి కూర్చుంటుంది. నిజానికి జగన్ మాదిరి చంద్రబాబు ఉంటే అనేక ఆర్ధిక కేసుల్లో ఉండి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తిని ఏమి చేయవచ్చో ఆలోచించండి. కానీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏరోజూ జగన్ మాదిరి ప్రవర్తించలేదు. ఇదే ఆంధ్రా ప్రజలను ఆలోచింపజేస్తుంది.

30రోజుల జగన్ పరిపాలన వైరల్ అవుతున్న వీడియో! | 30 days Jagan administration Video that goes viral!

30రోజుల జగన్ పరిపాలన వైరల్ అవుతున్న వీడియో!

బిజెపి దెబ్బకు TDP విలవిల - నెక్ట్స్ టార్గెట్ జగన్ అండ్ పార్టీనే

చంద్రబాబుపై నరేంద్రమోడి పగ మాములుగా లేదు. ఆంధ్రాలో టిడిపిని ఖాళీ చేయించే పని దాదాపు పూర్తీ చేసేసారు. అధికారంలోకి రాకుండా చేసారు, MPలను లాగేసుకుంటున్నారు, ఇప్పుడు 12మందికి పైగా MLAలపై టార్గెట్ పెట్టేసారు. వచ్చే ఎలక్షన్ లలో టిడిపి ఖచ్చితంగా కొత్త అభ్యర్ధులతో నూతన పార్టీ మాదిరి బరిలోకి దిగాల్సి వస్తుంది. అదే జరిగితే టిడిపి మనుగడ కష్టమయ్యిపోవచ్చు.

ఇక రెండో ప్రాజెక్ట్ జగన్ అండ్ పార్టీనే, దీనిని లొంగదీసుకోవడమో లేక తమలో విలీనం చేసుకోవడమో బిజెపికి పెద్ద కష్టం కాకపోవచ్చు. జగన్ ఎదురు తిరిగితే ఏమవుతుందో మనం ఈజీగానే ఊహించవచ్చు. ఎందుకంటే ఏ కేసులూ లేని చంద్రబాబునే మూలన పడేసిన మోడీ ...31 భారీ కేసులు మీదేసుకు తిరుగుతున్న జగన్ ను ఎలా వదిలిపెడుతుంది. ప్లానింగ్ ప్రకారమే బిజిపి ముందు జగన్ ను అడ్డుపెట్టుకుని టిడిపిని క్లోజ్ చేసి తరువాత  జగన్ అండ్ పార్టీని కూడా లేకుండా చేయాలని చూస్తుంది. పైకి మద్దతు ఇచ్చినా జగన్ ను కేసుల నుండి బయట పడేయకపోవడానికి ప్రధాన కారణం ఇదే! ఇదంతా బిజెపి ఎందుకు చేస్తుందంటే దక్షిణాది రాష్ట్రాలు తమ గుప్పిట్లో పెట్టుకోవడం కోసమే! ఇది ఎంతవరకూ జరుగుతుందో కాలమే చెప్పాలి!

AP అసెంబ్లీ సమావేశాలలో టీడీపీ పరిస్థితి ఎంత దారుణం!

ap-how-tdp-worst-in-ap-assembly-meetings
AP అసెంబ్లీ సమావేశాలలో టీడీపీ పరిస్థితి ఎంత దారుణం!
YSRCP ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న టీడీపీని అసెంబ్లీలో నానాయాగీ చేసి, స్పీకర్ పోడియంను చుట్టుముట్టి, గొడవలు సృష్టించి ఇక అసెంబ్లీలోనే అడుగు పెట్టకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు అదే పార్టీ  151మంది MLAలతో అధికారంలోకి వచ్చింది. ఇక టీడీపీ పరిస్థితి అసెంబ్లీలో ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. తారాస్థాయిలో YSRCP వాళ్ళు టిడిపి పై విరుచుకు పడుతున్నారు. ఆంధ్రాకి 14సం|| ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు అన్న కనీస గౌరవం కూడా అనిల్ కుమార్ యాదవ్, అంబటి, రోజా లాంటి వారికి లేదు. జగన్ వారిని కంట్రోల్ చేయకుండా ఆనందంతో ఉబ్బిపోవడం కడు శోచనీయం.

జగన్ ను, పవన్ కళ్యాణ్ ను ఉతికారేసిన Take one media

జగన్ ను, పవన్ కళ్యాణ్ ను ఉతికారేసిన Take one media

చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం ఉందా? | Does Chandrababu need to go to assembly?

చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం ఉందా? : 60మందికి పైగా MLAs  ఉన్నప్పుడు అసెంబ్లీని ఏమాత్రం పట్టించుకోలేదు జగన్. అటువంటప్పుడు కేవలం 23మంది MLAలు మాత్రమే ఉన్నప్పుడు చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లడం కరెక్ట్ కాదు,మంచిది కాదు. ఎందుకంటే అసెంబ్లీలో నానా గొడవలు సృష్టించి మాటి,మాటికీ స్పీకర్ పోడియంను చుట్టుముట్టే జగన్ పార్టీ ఈసారి అధికారంలో ఉన్నప్పుడు ఇక చంద్రబాబు అండ్ బ్యాచ్ ను బ్రతకనిస్తారా? చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లపోవడమే మంచిదని నాఅభిప్రాయం. దీనికిమీరేమంటారు?

Related Posts Plugin for WordPress, Blogger...