బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ఇంత జరిగినా తమ పంధాను మార్చుకోని కామెంటర్లు.

సంకలిని,హారం,బ్లాగిల్లు.. ఇప్పుడు కూడలి ఇలా ఎన్నో టాప్ మోస్ట్ అగ్రిగేటర్లు కాలగర్భంలో కలిసిపోతున్నా కొంతమందికి ఏమాత్రం సానుభూతి కూడా లేదు. ఇంకా పైపెచ్చు తొక్కలో అగ్రిగేటర్లని అతి దారుణమైన విమర్శలు గుప్పించడాలు. ఇలా తగలబడితే ఇక తెలుగు బ్లాగర్లు నిలబడేదేక్కడ చెప్పండి? అగ్రిగేటర్ల వలన ప్రయోజనం పొందుతున్నవారు ఎవరూ ఇంటువంటి కామెంట్లను ఉపేక్షించరు. కొంతమంది అదేం పోయేకాలమో విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు.ఇదొక పైశాచిక ఆనందమేమో మరి.!

14 comments:

  1. నీహారిక అని డైరెక్ట్ గా చెప్పవచ్చు కదా .. "కొంతమంది" అనడం ఎందుకు ?
    కొంతకాలం ఈ ఆగ్రిగేటర్లు లేకపోతేనే మంచిది

    ReplyDelete
  2. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. క్షమించాలి అరవింద్ గారూ! నీహారిక గారి పట్ల మీ కామెంట్ కాస్త అసభ్యకరంగా అనిపించడంతో తొలగించవల్సి వచ్చింది.

      Delete
    3. ఏమండీ చౌదరి గారూ! నా కామెంటులోని అసభ్యత ఉందన్నారు సరే! మరి ఆవిడాగారి కామెంట్లలో బూతులు కనిపించడం లేదా? దానికి నిదర్శనమే ఆమె కామెంట్!.ఇంతకీ ఆమె కామెంట్ తొలగించడానికి మీరు ఇంత సమయం వేసి ఉండవల్సిన వసరముందా? నా కామెంటుతో పాటు నీహారికగారిది కూడా తొలగించి ఉంటే బాగుండేది.ఇక మీ ఇష్టం.

      Delete
    4. This comment has been removed by the author.

      Delete
  3. అగ్రిగేటర్ అవసరం లేని దమ్మున్న బ్లాగ్ లు ఇప్పుడు ఏమి లేవు .
    మీ బ్లాగ్ కన్నా మీరు ఫేమస్ అయితే అప్పుడు అవసరం లేదు. అప్పటి వరకు అగ్రిగేటర్ అవసరమే .

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పింది 100% కరెక్ట్ సర్!

      Delete
  4. తొక్కలో ఆగ్రిగేటర్లు అనగల దమ్మున్న బ్లాగర్లు తమ బ్లాగుల్ని ఆగ్రిగేటర్ల నుంచి తీసేసుకుని వేరే బ్లాగుల్లో తమ తొక్కలో కామెంత్లు వెయకుండా తమ తొక్కలో బ్లాగుకే పరిమితమైతే సరిపోతుంది గదా!

    ReplyDelete
    Replies
    1. ఇప్పటివరకూ హారం గాని, కూడలిగాని, మాలిక గాని,బ్లాగిల్లు గాని ఎన్నో సేవలు చేశాయి. వారికి కనీసం కృతజ్ఞత చెప్పడం సంస్కారం. అది లేని వాళ్ళకు మనం ఏమి చెప్పినా బురదగుంటలో రాయి వేయడం వంటిదే! మీరు మళ్ళీ రంగంలోకి దిగితే పారిపోతారు.వద్దులెండి.వారి మానాన వారిని వదిలేయండి.

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
  5. మీరు వాడే పదాలనే నేను వాడుతున్నపుడు బూతు ఎలా అయిందో చెపుతారా ? భాషకు కూడా జెండర్ డిఫరెన్స్ ఉందా ? ఏ పదాలు వాడాలో ఏ పదాలు వాడకూడదో కూడా చెప్పండి. మీ ఆగ్రిగ్రేటర్ లో ఉంటే నీతి నియమాలతో కట్టుబడి ఉంటారు.

    ReplyDelete
    Replies

    1. భాష కి కూడా జెండర్ డిఫరెన్స్ ఉందా ! సూపర్ ప్రశ్న !

      జిలేబి

      Delete
  6. @తెలుగు బ్లాగర్లు ఎందుకిలా అయిపోయారు?

    haribabu:
    ఒక తేలుగు రాష్త్రం రెండుగా విడిపోవటం.
    మామూలుగా విడిపోలేదు కదా!

    పై స్థాయిలో రెచ్చగొట్టి తిట్టించిన వాల్ళు ఇవ్వాళ రెండు చోట్లా అధికారం పీఠం దక్కించుకుని శంకుస్థాపనలకీ యాగాలకీ ఒకరినొకరు ఆప్యాయంగా పిల్చుకుంటూ హ్యాపీగా ఉంటే వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయిన పిచ్చిపుల్లయ్యలు మాత్రం ఇంకా హ్యాంగోవరులోనే ఉన్నారు.తిట్టడం అనే దురలవాటు అంత తొందరగా పోదు కదా,మిగతావాటికీ అంటుకుంది.

    నిన్న తెలంగాణా వాళ్ళు చేసిందే ఇవ్వాళో రేపో మళ్ళీ రాయలసీమ వాళ్ళు మొదలుపెదతారు.మంచిని ఇమిటేట్ చెయ్యడం కష్టం గానె చెడుని ఇమిటేట్ చెయ్యడం చాలా తేలిక కదా!అప్పటి తెలంగాణోళ్ళు మొదట్నించే డైరెక్టుగా "రెండున్నర జిల్లాలోళ్ళు" అనేస్తే ఇప్పటి సీమోళ్ళు కొంచెం మొహమాటంగా "అధిపత్య ప్రాంతం వాళ్ళు" అంటున్నారు.రేపటి కల్లా మళ్ళీ ఆంధ్రా-తెలంగాణా బూతుల ప్రవాహం ఆంధ్రా-సీమ మధ్య మొదలవుతుంది.

    బ్లాగుల్లో వాదనలు చేసుకోవటం ఎప్పట్నించో ఉంది.నేను రావడమే ఆంధ్రా ఆకాసరామన్న దగ్గిర హోరాహోరీ పోరాటాల మధ్యకాలంలో వచ్చాను.బ్లాగుల్లోకి.నేను బ్లాగు ఓపెన్ చెయ్యడం విడిపోయాకే జరిగింది.కొత్తల్లో అక్కడక్కడా నాతో వాదనలు చేతున్న ప్రవీణ్ కొన్ని బ్లాగుల మూసివేఅతకి కారణం అని చదివి నిజంగా ఒక వ్యక్తి వల్ల బ్లాగులు మూతబడతాయా అనే సందేహంతో అతని చరిత్ర కోసం వెతికితే మలక్ పేట రౌడీ.మార్తాండ,ఇంకా చాలాపేర్లు తెలిశాయి.లింకులు పట్టుకుని ఆయా బ్లాగుల పాతపోష్టుల్లోని చర్చల్నీ చదివాను.

    అప్పటి వాదనలన్నీ మలక్ పేట్ రౌడీ బ్లాగులో వచ్చే భారత/హిందూ అనుకూల పోష్టుల దగ్గిర అతని వ్యతిరేకత చుట్టూ నడిచినాయి.ప్రవీణ్ ఈ మధ్యనే తను విశాఖ లైబ్రరీలో కొత్తగా ఆర్క్సిజం పుస్తకాల్ని చదువుతున్నాను అంటున్నాడు గాబట్టి అప్పటికి అసలు కమ్యునిజం అంటే ఏమిటో సరిగ్గా తెలిసి ఉండక పోవచ్చు.అయినా అప్పటి రోజుల్లో ఇతనే మెయిన్ ఫోస్కస్ బ్లాగుల్లో!

    P.S:ఈ మొత్తం విషయాల మీద ఒక పోష్టునే వెయ్యాలని అనుకుంటున్నాను.కాబట్టి స్థూలంగా నాకు అర్దమయినది చెప్తాను.నా అవగాహనలో ఏఅమైనా తప్పులు ఉంతే మీరు సరిదిద్దీతే అవి నా పోష్టులో తప్పకుండా గణనలోకి తీసుకుంటాను.అదేమైన అదీనికి అడ్డుకట్ట వెయ్యాల్సిందే గాబట్టి నేను పోష్టు వెయ్యడం తప్పనిసరిగా జరుగుతుంది.

    అప్పటి నున్వ్హీ ఒప్పటి వరకూ బ్లాగుల్లో జరిగిన వాదనల్ని చూస్తే నాకు మూడు వైరి పక్షాలు కనిపిస్తున్నాయి - 1;హిందూత్వ అనుకూల-హిందూత్వ ప్రతికూల,2.ఆంధ్రప్రదేశ్ విభజన అనుకూల-ఆంధ్రప్రదేశ్ విభజన ప్రతికూల,3.కమ్యూనిష్టు అనుకూల-కమ్యూనిష్టు ప్రతికూల

    ఈ ఎజెండాలు ఉన్న బ్లాగర్లు వాదనలు చెయ్యటం అంతకు ముందు నుంచీ ఉన్నప్పటికీ బూతులు భాసహలోకి రావటం అనెది 2వ క్యాటగిరీ రంగప్రవేశం జరిగాకనే మొదలైంది.ఆ హ్యాంగోవరు వదిల్తే గానీ సిచ్యూయేషన్ మామూలు పొజిషనుకి రాదు
    ద్వస్తి.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...