తెలుగు అంతర్జాలంలో ఎన్నో గొప్ప ఉత్తమ బ్లాగులు అట్టడుగున పడియున్నాయి. వాటిల్లో తెల్సుకోవలసినవి, నేర్చుకోవలిసినవి ఎన్నెన్నో విషయాలు దాగి ఉన్నాయి.వాటి వలన మనకు ఎంతో జ్ఞానాన్ని సమకూర్చుకునే అవకాశాలు మెండుగా వున్నాయి. మరి అటువంటి బ్లాగులకు ఈరోజు తెలుగు అగ్రిగేటర్ గోడ మీద చోటు లేకుండా పోయింది. కాబట్టి వాటినన్నిటిని ఎందుకు మనం బయటకు లాగకూడదు? మన బ్లాగ్ వేదిక రీడర్లకు ఎందుకు పరిచయం చేయకూడదు? అని అనిపించింది. అనుకున్నదే తడవు ఒక ప్లాన్ గీశాను. దాని ప్రకారం కనీసం వీలును బట్టి నెలకు రెండు,మూడు ఉత్తమ బ్లాగులను మన బ్లాగ్ వేదిక రీడర్లకు పరిచయం చేయాలనుకుంటున్నాను. దానితో పాటు గతంలో అనుకున్న ఉత్తమ బ్లాగుల శీర్షికను కూడా నిర్వహించినట్లు అవుతుంది. ఎలా అంటే పరిచయం చేసిన బ్లాగులన్నీ ఉత్తమ బ్లాగుల శీర్షిక సరసన చేర్చి వేయడం జరుగుతుంది. ఈ ప్లానింగ్ అమలు చేస్తే ఎలా ఉంటుందంటారు?
No comments:
Post a Comment