బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Did Prime Minister Narendra Modi's regime really benefit the country? | ప్రధాని నరేంద్ర మోడీ పాలన నిజంగా దేశానికి మేలు చేసిందా?

Did Prime Minister Narendra Modi's regime really benefit the country? | ప్రధాని నరేంద్ర మోడీ పాలన నిజంగా దేశానికి మేలు చేసిందా?
ఒక మిత్రుడు పంపిన Facebook లింక్ ద్వారా ఈక్రింది పోస్టు వేశాను. అతని అభిప్రాయం ఎంతవరకూ వాస్తవమన్నది చూడటం కోసమే తప్ప ఇది నా స్వంత అభిప్రాయం మాత్రం కాదు. దేశానికి నిజంగా ఇంత గొప్ప ప్రయోజనాలు చేకూరాయా? లేక రాజకీయ అభిమాన డబ్బానా అనేది తెలియడం కోసమే!

మన గౌరవప్రదమైన ప్రధాని శ్రీ నరేంద్ర మోడిజీ ఈమధ్యన ఎందుకు చాలా మంది చేత విద్వేషాన్ని ఎదుర్కొంటున్నాడని నేను చాలా ఆశ్చర్యపోయి ఆలోచించడం మొదలెట్టాను. చాలా వాస్తవాలను విశ్లేషించిన తరువాత ప్రతి అవినీతిపరులైన రాజకీయ నాయకులు, నల్లధనం బాధితులు, తీవ్రవాద గ్రూపులు, ఆటంకవాదులు, దేశద్రోహులు అందరి కడుపుమంటకి నిజమైన కారణం మన దేశభక్తుడైన ప్రధాని నరేంద్ర మోడిజీ యొక్క అవినీతి వ్యతిరేక విధానాల కారణంగానే అని అర్ధమైంది.
అది డి-మోనటైజేషన్ లేదా
బ్యాంక్ ఖాతాలతో ఆధార్ జత చేయడం, లేదా
టాక్సులు, సంపాదన, ఆదాయాలకు పాన్-కార్డుతో సహా ఆధార్ జత చేయడం
తద్వారా నల్లధనం నిర్మూలన, మాత్రమే వారి ద్వేషానికి కారణాలని కళ్ళకు కట్టినట్టు అర్ధమైంది....
వివరాలు:
* ఒక కొత్త బేస్ (ఆధార్ నం) ని లింకప్ చేయడం ద్వారా, ఒక మిలియన్ మంది కటిక పేదలు మహారాష్ట్రలో అదృశ్యమయ్యారు *

* 30 మిలియన్ల (30,000,000) నకిలీ LPG కనెక్షన్ ఖాతాదారులు మాయమయ్యారు *

* మదరసాల నుండి ఉపకార వేతనాలు పొందుతున్న 1,95,000 నకిలీ బాల బాలికల జాబితా ఎడారి ఎండమావిలా అదృశ్యమైంది *

* 1.5 మిలియన్ల (1,500,000) నకిలీ రేషన్ కార్డుదారులు అదృశ్యమయ్యారు *

ఎందుకని ఈ తరహా నకిలీమనుషులు, అకౌంట్స్ ఖాతాదారులు మాయమవ్వడం ఎలా మొదలైంది ?
ఈ బ్లాక్ మార్కెట్ దొంగల మొత్తం చిట్టా బయట పడబోతోంది....... కాబట్టి ఈ దొంగలందరూ కలిసి గౌరవనీయమైన సుప్రీంకోర్టులో దాఖలు చేసిన దావా ప్రాథమిక ఆదాయ నివేదికలకు ఆధార్, పాన్ కార్డుల జతచేయడం అనేది మా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని వాజ్యం వేశారు. కొందరు ముఖ్యమంత్రులు కూడా ఈ చిట్టాలో ఉండడం మన ప్రజాస్వామ్యానికి అత్యంత హేయకరం *

మోడీ ఎం చేసాడు ?

* 1) 3 లక్షల పేపర్ నకిలీ కంపెనీలను మూసివేయబడ్డాయి. *

* 2) రేషన్ డీలర్లు దొంగ లిస్టులు కోల్పోవడంతో చాలా కోపంగా ఉన్నారు *

* 3) అక్రమ ఆస్తుల, బినామీ కింగ్ లు, బ్రోకరేజ్ డీలర్లు అందరూ తీవ్ర అసహనంతో ఉన్నారు *

* 4) అక్రమాలకు అలవాటు పడ్డ బ్రోకర్లు Online సాధన వ్యవస్థతో తమ గుట్టులు రట్టవుతాయని బెంబేలుపడ్డారు. *

* 5) 40,000 నకిలీ NGO లను మూసివేశారు, కాబట్టి ఈ NGO ల యజమానులు శరాఘాత హతాశులయ్యారు *

* 6) బినామీ నంబర్ టూలనుండి ఆస్తి కొనుగోలు చేసిన వ్యక్తులు హతాశులయ్యారు. *

* 7) ఇ-టెండర్ ప్రక్రియ ద్వారా, చాలామంది కాంట్రాక్టర్ల పప్పులు ఉడకడం మానివేశాయి. *

* 8) గ్యాస్ కంపెనీల ఆధారం చేయడం వాళ్ళ కొందరి ఆగ్రహం! *

* 9) ఇప్పటి వరకు, ఎప్పుడూ టాక్స్ అనేదే కట్టి ఎరుగని, కొత్తగా ఆదాయం పన్ను స్కాన్ కింద వచ్చి జేరిన 12 మిలియన్ల ప్రజల నుంచి వ్యతిరేకత ప్రారంభం అయ్యింది. *

* 10) GST వ్యవస్థ పరిచయంతో, వ్యాపార ప్రజలు ఏం చేయాలో పాలుపోక వ్యతిరేకత మొదలుపెట్టారు. ఎందుకంటే ప్రజలందరూ ఆటోమేటిక్ చెల్లింపు వ్యవస్థకు వచ్చారు! *

* 11) నంబర్ టూ వ్యక్తుల ఆటలు సాగక, ఏం చేయాలో పాలుబోక అసహనులయ్యారు. *

* 13) దాచిన నల్లధనాన్ని తెల్లబరచడం కాస్త బాగానే పెళుసుగా మారి గట్టి దెబ్బ తీసింది. *

* 14) సోమరిపోతు ప్రభుత్వ అధికారులు సమయానికి రావడం, పోవడం నిష్ఠగా పనిచేయడం అన్నది ఎరుగక అతలాకుతలం అయ్యారు. *

* 15) సమయానికి పని చేయడమనే అలవాటు లేక, లంచాలను తీసుకోవడం మరిగిన ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు జరుగుతోంది అర్ధం కాక నోరెళ్లబెట్టారు. *

* 16) నకిలీ కరెన్సీ డీలర్స్: - డిజిటల్ ఎకానమీ కారణంగా వారిపై ఒత్తిడి పెరిగి కకావికలమయ్యారు. *

* 17) తీవ్రవాద, ఉగ్రవాద, ముసుగు సంస్థలు: - వారి నిధుల సమీకరణ అనేది కరువై అత్యంత దయనీయంగా తయారైంది. *

* 18) రియల్ ఎస్టేట్ మాఫియా: - వారి చెల్లింపులల్లో, లావాదేవీల్లో చాలా పెద్ద భాగం నగదు రూపంలో ఉంటుందనీ, CASH FLOW కారణంగా అకౌంట్ జమ చేయలేని నగదు, నల్లధనం వివరాలు బయటకి కక్కలేక కకావికలం అయ్యారు. ఇప్పుడు అవి లెక్కించని నగదుకు, నల్లధనం ఎం చేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. *

* 19) రాజకీయ నాయకులు: - దాదాపుగా జీరో స్కాములు అని నిరూపించబడిన శ్రీ నరేంద్ర మోడిజీ కూడా తన పూర్వ ప్రధాన మంత్రుల వలె ఉండి, కళ్ళు, చెవులు మూసుకు పోవచ్చని, ఆశ పడ్డ రాజకీయ నాయకులు, బ్రోకరేజ్ వ్యక్తులు, సంస్థలు మోడీ గారి తీరుకి తీవ్ర అసంతృప్తికి మనస్తాపానికి గురయ్యారు.

ఇలా మోడీ వ్యతిరేకులు అందరూ కట్ట కట్టుకుని మోడీ వ్యతిరేకంగా కలిసిపోయి, ఒక కూటమిగా ఏర్పడి కూటు ఖిచిడి పార్టీని ఏర్పాటు చేయడానికి చేతులు కలిపారు. శ్రీ నరేంద్ర మోడిజీ రెండోసారి గద్దె ఎక్కకుండా ఉండాలని వెతకని దారి లేదు, లేపని రాయి లేదు.

అందువల్ల ఈ బాధ్యత ఇప్పుడు 1.25 బిలియన్ల మంది భారతీయులపై ఆధారపడి ఉంది.....
అవినీతిపరులైన ఖిచిడి పార్టీలకు మద్దతు ఇవ్వాలో...... లేదా
ఈ భరతమాత యొక్క నిజమైన కుమారుడు, ,భారతపుత్రుడు మన గౌరవప్రదమైన ప్రధాని శ్రీ నరేంద్ర మోడిజీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారా అని నిర్ణయించడం అనేది మన చేతుల్లోనే ఉంది.
ఇప్పుడుబాల్ మీ కోర్టులో ఉంది. చేయాల్సింది మనమే. *

జైహింద్ ! జైభారత్ *

Source : https://www.facebook.com/permalink.php?story_fbid=242771036708095&id=100029256018791&__tn__=K-R

వాట్సాప్ గ్రూపులో జర జాగ్రత్త.. తేడా కొడితే నేరుగా జైలుపాలే!

Whatsapp -GROUP-CELL-BEWARE-If-the-difference-comes-from-Arreste-blog-vedika-news
ఇవాల్టి రోజున వాట్సాప్ వాడనోళ్లు లేరు. ఒకసారి వాట్సాప్ వాడటం మొదలెడితే.. ఏదో గ్రూపులో సభ్యుడిగా ఉండటం.. అలాంటి గ్రూపులు బోలెడన్ని ఒక్కొక్కరి అకౌంట్లో ఉండటం మామూలే.  ఈ గ్రూపుల్లో తమకు తెలిసిన సమాచారాన్ని.. ఫోటోల్ని.. వీడియోల్ని షేర్ చేసే ఔత్సాహికులు ఎందరో. అయితే.. ఇలా గ్రూపుల్లో పోస్టులు పెట్టే ఉత్సాహవంతులు కొన్నిసార్లు తెలీకుండానే తప్పులు చేస్తుంటారు.

మనసులో ఏమీ లేనోళ్లు కూడా అడ్డంగా బుక్ అవుతారు. వాట్సాప్ గ్రూపులో పెట్టే పోస్టులో ఏదైనా తేడా కొడితే నేరుగా జైలుపాలే. ఈ విషయం తాజాగా మరోసారి రుజువైంది. హైదరాబాద్ లోని మౌలాలి షఫీనగర్ లో నివసించే మహమ్మద్ సాహెబాబ్ ఉల్ మునీర్ అలియాస్ 26 ఏళ్ల సిరాజ్ జొమాటోలో డెలివరీ బాయ్ గా పని చేస్తుంటారు.

ఈ 12 రకాల మెయిల్స్ ఓపెన్ చేస్తే ఇక అంతా డేంజరే!! | These 12 types of e-mails are open to Danger!

12-these-12-types-of-e-mails-are-open-to-Danger
These 12 types of e-mails are open to Danger!
ఇంటర్నెట్ వాడకం అనేది విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో దాడులు కూడా అంతే స్థాయిలో పెరిగిపోతూ వస్తున్నాయి. సైబర్ క్రిమినెల్స్ ఈ ఇంటర్నెట్ సాయంతో అనేక చోరీలను చేస్తున్నారు. యూజర్ల వ్యక్తిగత సమాచారం దగ్గర నుండి మొత్తం బ్యాంకు అకౌంట్ల వరకు సమస్త సమాచారాన్ని తమ అదుపులోకి తీసుకుంటున్నారు. హ్యాకింగ్ టూల్స్ ని ఉపయోగించి బ్యాంకులను సైతం కొల్లగొట్టేస్తున్నారు. ముఖ్యంగా స్పామ్ ఈ మెయిల్స్ ద్వారా అనేక రకాలైన మోసాలకు పాల్పడుతున్నారు.

స్పామ్ మెయిల్స్ పంపించి యూజర్లను వారి ట్రాప్ లోకి లాక్కుని అందినకాడికి దోచుకుంటున్నారని ఈ మధ్య కొన్ని సెక్యూరిటీ సంస్థలు సైతం అలర్ట్ మెసేజ్ లు జారీ చేశాయి. అలాంటి వాటిల్లో ఈ మధ్య ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ బర్రాకుడా నెట్ వర్క్ కూడా కొన్ని అలర్ట్ మెసేజ్ లను జారీ చేసింది. అవేంటో ఓ సారి చూద్దాం.

అత్యాచార ఘటనలు జరుగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

మన దేశంలో ప్రతిరోజూ ఏదో ఒకచోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పసికందుల నుండి పండు ముదుసలి వరకూ అత్యాచార మృగాలకు బలవుతూనే ఉన్నారు. ఎంతోమంది తల్లిదండ్రులు కన్నీటి సంద్రంలో మునిగిపోతూనే ఉన్నారు. ఇక నుండి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మన చట్టాలను ఏవిధంగా మార్చాలి? మీ సూచనలు కామెంట్ రూపంలో పెట్టండి. నలుగురికి అవగాహన కల్పించండి.

బాధితుల్ని కాపాడలేని పోలీసులు నిందితుల్ని మాత్రం రక్షిస్తున్నారు

Disha-Clashes-Between-Accused-At-Cherlapally-Jail
హైదరాబాద్ శివార్లలో వెటర్నరీ వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్య ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఈ ఘటన జనాల్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. ఈ ఉదంతం జరిగి ఐదు రోజులు దాటుతున్నా ప్రజాగ్రహం చల్లారలేదు. ఆ నిందితుల్ని మా చేతికివ్వండి.. వాళ్లకు నరకం చూపించి హతమారుస్తాం అంటూ జనాలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో అయితే జనాగ్రహం ఇప్పట్లో చల్లారేలా లేదు. నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశాక జైలుకు తరలించే సమయంలో షాద్ నగర్ ప్రాంతంలో ఎంతటి ఉద్రిక్త వాతావరణం నెలకొందో తెలిసిందే. ఈ నేపథ్యంలో నిందితుల పైకి జనాలు ఎప్పుడెలా ఎటాక్ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.

మీ బ్లాగు ఏ పొజిషన్ లో ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా?

మీ బ్లాగు ఏ పొజిషన్ లో ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? : అయితే మీరు వెంటనే క్రింది సూచించిన లింక్ ద్వారా వెళ్ళి ఆ వెబ్సైట్ లో మీ బ్లాగు యొక్క URL లింక్ ఇవ్వండి. దాని ద్వారా మీ బ్లాగు యొక్క SEO Ranking ఎలా ఉంది? మీ బ్లాగు యొక్క డొమైన్ ఆధారిటీ, అలెక్షా ర్యాంకింగ్ తో పాటు మరెన్నో విషయాలు చక్కగా తెలుసుకోవచ్చు.
Related Posts Plugin for WordPress, Blogger...