These 12 types of e-mails are open to Danger! |
స్పామ్ మెయిల్స్ పంపించి యూజర్లను వారి ట్రాప్ లోకి లాక్కుని అందినకాడికి దోచుకుంటున్నారని ఈ మధ్య కొన్ని సెక్యూరిటీ సంస్థలు సైతం అలర్ట్ మెసేజ్ లు జారీ చేశాయి. అలాంటి వాటిల్లో ఈ మధ్య ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ బర్రాకుడా నెట్ వర్క్ కూడా కొన్ని అలర్ట్ మెసేజ్ లను జారీ చేసింది. అవేంటో ఓ సారి చూద్దాం.
బర్రాకుడా నెట్‌వర్క్స్
సైబర్ సెక్యూరిటీ సంస్థ బర్రాకుడా నెట్‌వర్క్స్ ఈ మెయిల్స్ ద్వారా ఎలాంటి మోసాలకు పాల్పడుతున్నారనే అంశంపై జరిపిన పరిశోధనలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. యూజర్లను ట్రాప్ చేసేందుకు సైబర్ నేరగాళ్లు పంపిన 36 లక్షల ఫిషింగ్ ఈ మెయిల్స్‌ని ఆ సంస్థ పరిశీలించింది. వాటిలో యూజర్లు ఎక్కువగా స్వీకరించే 12 రకాల ఈ మెయిల్స్‌ను గుర్తించింది.
హ్యాకర్లు పంపే ఈ మెయిల్స్‌లో
అలాంటి ఈ మెయిల్స్ మీకూ వచ్చే ఉంటాయి. సాధారణంగా అపరిచితుల నుంచి ఈమెయిల్ వస్తే పేరు, సబ్జెక్ట్ చూసి ఓపెన్ చేయడం చాలామందికి అలవాటు. ఇక్కడే హ్యాకర్లు తెలివిగా ఆలోచిస్తున్నారు. మీరు ఈ మెయిల్ ఓపెన్ చేసేలా సబ్జెక్ట్‌లో రాస్తున్నారు. హ్యాకర్లు పంపే ఈ మెయిల్స్‌లో ఎక్కువగా కనిపించే 12 రకాల సబ్జెక్ట్స్ ని వారు గుర్తించారు
12 రకాల సబ్జెక్ట్స్
Request, Follow up, Urgent/Important, Are you available?/Are you at your desk, Payment Status, Hello, Purchase, Invoice Due, Re:, Direct Deposit, Expenses, Payroll
స్పామ్ ఈ-మెయిల్స్ నుంచి రక్షణ పొందండం ఎలా ?
మీ మెయిల్ అకౌంట్‌లోకి మీ ప్రమేయం లేకుండా అవసరం లేని స్పామ్ మెయిల్స్ చాలానే వస్తుంటాయి. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఇబ్బంది పెడుతున్న అతిపెద్ద సమస్య ఇదేనని చాలామంది వాపోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఇంటర్నెట్ లో కనిపించిన ప్రతీ చోటా మెయిల్ ఐడీ ఇష్టానుసారం ఇవ్వడంమేనని టెక్ నిపుణులు చెబుతున్నారు. మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఇబ్బంది పెడుతున్న అతిపెద్ద సమస్య ఇది. మరి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో కొన్ని రకాల ట్రిక్స్ ఇస్తున్నాం. ఓ సారి మీరు మీ మెయిల్ అకౌంట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోండి.
స్పామ్(SPAM) నుంచి తప్పించుకునే ఉపాయాలు:
మీ ఇమెయిల్ అడ్రస్‌ను యథాతథంగా ఇంటర్నెట్‌లో ఉంచకండి. ఒకవేళ మీ ఈ-మెయిల్ అడ్రస్ పెట్టవలసిన అవసరం ఏర్పడితే, దాన్ని ముందు వెనకాల చిన్న చిన్న మార్పులతో, లేక అడ్రస్‌నే ముందు వెనుకలుగా మార్చి ఇంటర్నెట్‌లో పెట్టండి.
వెబ్‌సెర్చ్ ఇంజన్‌లలో..
స్పామర్లు గూగుల్ వంటి వెబ్‌సెర్చ్ ఇంజన్‌లలో ప్రవేశించిన వెంటనే మీ ఇమెయిల్ అడ్రస్ సులువుగా వారికి కన్పించేలా ఉందేమో గమనించండి. చాలా రకాల ISP ఉచిత ఈ-మెయిల్ అడ్రస్‌లను ఇస్తున్నాయి. వీటిని తప్పక ఉపయోగించండి.
రెండు ఈ-మెయిల్ అడ్రస్‌లను
అందులో మీరు రెండు ఈ-మెయిల్ అడ్రస్‌లను క్రియేట్ చేసుకొని a)ఒకటి స్నేహితులకు, సహ ఉద్యోగులకు, బంధువులకు మెయిల్ చేసేందుకు ఉపయోగించవచ్చు. b)రెండవ దాన్ని న్యూస్ లెటర్‌లను రాసుకోవడానికి లేక ఫోరమ్స్‌ను పోస్టింగ్ చేయడానికి మరియు ఇతర పబ్లిక్ లొకేషన్ల కోసం వినియోగించుకోండి.
మీకు వచ్చే స్పామ్స్ గురించి..
అయినా మీకు వచ్చే స్పామ్స్ గురించి మీ ISPకి ఫిర్యాదు చేయండి. న్యూస్ గ్రూప్ పోస్టింగులకు సమాధానాలు రాసేటప్పుడు ఇమెయిల్ ఐడీలను దానికి అనుసంధానించి పంపకండి. వెబ్‌ఫామ్‌లను నింపుతున్నపుడు ఆ సైట్ ప్రైవసీ పాలసీని తప్పని సరిగా చెక్ చేయండి.
మీ మెయిల్ అడ్రస్‌లను..
ఆ సైట్ మీ మెయిల్ అడ్రస్‌లను ఇతర కంపెనీలకు అమ్మడం కానీ లేక ఇవ్వడం /పంపడం కానీ చేస్తుందేమో పరిశీలించిన తర్వాతనే దాన్ని పూర్తి చేయండి. మీకు వచ్చే స్పామ్ మెయిల్స్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిస్పందించకండి.
మీ మెయిల్ ఐడీలను
ఒకవేళ మీరు సమాధాన మిచ్చినట్లయితే, మీ మెయిల్ ఐడీలను తన మెయిలింగ్ లిస్ట్ నుంచి తొలగించమని రిక్వెస్ట్ చేయండి. మీ సిస్టమ్‌లోని యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయ్యేలా చూసుకోండి. ఎన్నో వైరస్‌లు, ట్రోజాన్‌లు మీ హార్డ్‌డిస్క్‌ను ఇమెయిల్ అడ్రస్‌ల కోసం వెదుకుతూ ఉంటాయి. మీరు మీ సిస్టం యొక్క యాంటి వైరస్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా మీ సహచరుల ఇమెయిల్ అడ్రస్‌లు స్పామ్ బారినపడకుండా కాపాడండి.
మెయిల్ అభ్యర్థనలకు..
మీ అకౌంట్ వివరాలు అందజేస్తే తప్ప గుర్తించనటువంటి మెయిల్ అభ్యర్థనలకు ఎట్టి పరిస్థితులలోనూ ప్రతిస్పందించకండి. మీ బ్యాంకు, క్రెడిట్ కార్డు కంపెనీ, ఇ-బే, పేపాల్ మొదలయిన వాటిలో మీ అకౌంట్‌కు సంబంధించిన అన్ని వివరాలు వారివద్దే ఉంటాయి.వాటిని తిరిగి అడిగే అవసరం ఉండదు. ఒకవేళ అవసరం అనుకుంటే ప్రత్యక్షంగా కలవడంగానీ, ఫోన్ ద్వారా గానీ సంప్రదించాలి. మీ లాగ్ ఇన్ వివరాలను ఇతరులెవ్వరికీ ఎటువంటి పరిస్థితులలోనూ ఇవ్వకండి.
జిమెయిల్స్ (Gmail) సెట్టింగ్స్‌లోని ఫిల్టర్స్‌ను ఉపయోగించడం ఎలా: జిమెయిల్‌లోకి లాగిన్ అయిన తర్వాత 'సెట్టింగ్స్ (Settings)' అనే బటన్ ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత వచ్చే విండోలో కనిపించే సెట్టింగ్స్ మెనూలో నాల్గవ ఆప్షన్ 'ఫిల్టర్స్'(Filters). ఈ బటన్‌పై క్లిక్ చేయాలి.ఇప్పుడు వచ్చే స్క్రీన్‌లో కనిపించే Create a new filter అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు Create a Filter కు సంబంధించిన ఆప్షన్‌తో ఒక స్క్రీన్ వస్తుంది. అందులో 'ఫ్రం' (From) అనే బాక్సులో మీరు ఏ మెయిల్ ఐడి నుండి వచ్చే మెసేజ్‌లను వాటంతటవే డిలీటయ్యేలా సెట్ చెయ్యాలనుకుంటున్నామో ఆ మెయిల్ అడ్రస్‌ని టైప్ చెయ్యాలి.
సబ్జెక్ట్ లైన్'లో వున్న మెయిల్స్
దీని కిందనే వున్న 'సబ్జెక్ట్'(Subject) ఫీల్డ్‌లో ఏదైనా నిర్దిష్టమైన పదం/వాక్యం 'సబ్జెక్ట్ లైన్'లో వున్న మెయిల్స్‌కి మాత్రమే ఆ ఫిల్టర్ అప్లై చెయ్యబడేలా లేదా అటాచ్‌మెంట్లు వున్న మెయిల్స్‌కు మాత్రమే ఫిల్టర్ అప్లై అయ్యేలా టైప్ చేయాలి. ఇలా మీ అవసరాన్ని బట్టి పలు సెట్టింగులు ఎంచుకోవచ్చు.ఆ తర్వాత Next Step అనే బటన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ''ఆ మెయిల్ ఐడి నుండి వచ్చిన మెయిల్ మెసేజ్‌లను చూపడంతోపాటు వాటిని ఏం చెయ్యమంటారో తెలపండి'' అంటూ ఓ స్క్రీన్ వస్తుంది. అందులో వరుసగా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి.
Delete it
వాటిలో Delete it అనే బటన్‌పై టిక్ పెట్టి, దాని కిందనే వున్న Create Filter బటన్ క్లిక్ చేయాలి. ఒకవేళ మనం డిలీట్ చేయాలనుకుంటున్న మెయిల్ ఐడి నుండి గతంలో వచ్చిన మెసేజ్‌లు ఏమైనా మన 'ఇన్‌బాక్స్'లో వుంటే, పనిలోపనిగా వాటిని కూడా డిలీట్ చెయ్యాలంటే, పైన చెప్పినట్లుగా బటన్‌పై ప్రెస్ చేసే ముందే క్రియేట్ ఫిల్టర్ పక్కనే వున్న Also apply filter to conversations బటన్‌పై టిక్ చెయ్యండి. ఇక్కడ మనం డిలీట్ చేయాలనుకున్న మెయిల్ ఐడీ నుండి వచ్చిన మెయిల్స్ సంఖ్యనుకూడా చూపుతుంది. ఆ తర్వాత Create Filter అనే బటన్‌పై క్లిక్ చేయాలి.ఇలా ఫిల్టర్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇకపై ఆ మెయిల్ ఐడి నుండి వచ్చే ప్రతీ మెసేజ్ దానంతట అదే డిలీట్ చెయ్యబడుతుంది.
No comments:
Post a Comment