బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు బ్లాగుల అభివృద్ధి కొరకు మనం ఏమి చేయాలి?

గతకాలంలో ఒకరికొకరు దారుణంగా విమర్శించుకోవడం వలన తెలుగు బ్లాగర్లు విసిగి చెంది తమ బ్లాగులను మూసివేశారని కొంతమంది వాదన. కొంతమందేమో మంచి విషయాలు కలిగిన తపాలే లేవు కేవలం సినిమాల గురించి, షికార్ల గురించి తప్ప మరికొందరి వాదన. మరీ కొంతమందైతే "ప్రజ" ,"రచ్చబండ" లాంటి చర్చా బ్లాగుల వల్లే ఒకరిపట్ల,మరొకరు తిట్టుకోవడాలు,దారుణంగా విమర్శించుకోవడాలు చేస్తున్నారు. ఎలాగైనా వీటిని మూసివేస్తేనే ప్రయోజనమని వాదన. ఇలా రకరకాలుగా వాదనలున్నాయి. ఏది ఏమైతేనే మొత్తానికి తెలుగు బ్లాగుల ప్రాబల్యం తగ్గిపోతుంది. ఇటువంటి పరిస్థితులలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అభివృద్ధి కొరకు మనం ఏమి చేయాలి?

What do we do for development of Telugu blogs?

"పల్లె ప్రపంచం" కొండలరావు గారు బ్లాగ్ లోకానికి తిరిగి వచ్చినందుకు సంతోషం.

ప్రజా చర్చావేదికతో ఉర్రూతలూగించిన పల్లా కొండలరావుగారు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. అంతంతమాత్రమే నుడుస్తున్న బ్లాగ్ లోకానికి నిహారికా గారిలాంటి తెలుగు బ్లాగర్లందరూ తిరిగి వచ్చేస్తే చాలా బాగుంటుంది. మన తెలుగు బ్లాగులలోకానికి పూర్వపు వైభవం తిరిగి తెచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.
హాయ్ కొండలరావుగారూ బ్లాగ్ వేదిక తరుపున మీకు స్వాగతం...సుస్వాగతం. మీ చౌదరి- Sakshyam Magazine.

ప్రముఖ బ్లాగ్ కామెంటర్ జిలేబీ గారు ఏమైపోయారు?

ఎవరు టపా వ్రాసిన టపా...టపా...టపా మని శతకాలన్నీమిక్సీ లో వేసి అన్నీ బాగా కలిసిన తరువాత తీసిన పద్యాలతో ఊదరగొట్టే మన జిలేబీ మేడం గారు ఏమైపోయారు? అసలే తెలుగు బ్లాగుల ప్రపంచం అంత మాత్రంగానే మిగిలియున్న ప్రస్తుత తరుణంలో జిలేబీ గారిలాంటి సంచలన కామెంటర్ మాయమయ్యిపోవడం చాలా ఆశ్చర్యంగానూ, ఆందోళనగానూ ఉంది.

ఈమధ్య ఒక బ్లాగ్ కామెంటర్ ఎవరో జిలేబీ ఇక లేరు అని పెట్టాడు. అది చదివిన వెంటనే దిగ్భ్రాంతికి గురైపోయాను. నిజమేనా? ఆమె ఎందుకు రావడం లేదు? నిజంగానే (బ్లాగ్)లోకంనుండే నిష్క్రమించిందా? జిలేబీ గారితో దగ్గరి సంబంధం ఉన్న వారెవరైనా వివరాలు తెలుసుకుంటే బాగుంటుంది.

సహజంగా బ్లాగర్లకు ఇతర బ్లాగర్లతోనూ సంబంధం ఏర్పడుతుంది. ముఖ పరిచయం ఉండనప్పటికీ బ్లాగ్ పరంగా ఆయా బ్లాగర్లతో కామెంట్ రూపంలోనో లేక పోస్టుల రూపంలోనో పరిచయ సంబంధం ఏర్పడుతుంది.కొంతకాలం పాటు బ్లాగులలో బాగా తిరిగిన వ్యక్తులు ఒక్కసారే బ్లాగు ప్రపంచంలో కనిపించడం మానివేస్తే రకరకాల సందేహాలు వచ్చి బాధకు గురవుతాము. అసలు వాళ్ళు ఏమైపోయారు? ఉన్నారా? లేరా? ఇటువంటి సందేహాలు వస్తాయి. నిజానికి ఒకప్పుడు పల్లె ప్రపంచం పేరుతో పల్లా కొండలరావు ఉండేవారు. ఇప్పుడాయన బ్లాగులోకంలో కనిపించడమే మానివేశారు. అయితే ఆయన తన బ్లాగులో ఇచ్చిన ఫోన్ నంబర్, అడ్రస్ లేక మెయిల్ ఆయనను డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి యోగ క్షేమాలు అడిగే అవకాశం కలిగించాయి. దీనిని బట్టి చూస్తే ప్రతి బ్లాగర్ తన బ్లాగులో తన గూర్చిన వివరాలు పొందుపర్చితే బాగుంతున్దనిపిస్తోంది.దీనికి మీరేమంటారు? జిలేబీ గారి విషయంలో జరుగుతున్న గందరగోళం మన విషయంలోనూ కలుగదు కదా?

బ్లాగ్ వేదికను సంప్రదించిన నూతన బ్లాగర్లకు ఒక శుభవార్త!

ప్రియమైన తెలుగు బ్లాగర్లకు....
మీరు తెలుగు బ్లాగుల అగ్రిగేడర్ బ్లాగ్ వేదికను సంప్రదించి మీకు బ్లాగులను జత చేయమని విన్నపించిన బ్లాగులన్నింటిని "బ్లాగ్ వేదిక" అగ్రిగేడర్ లో నమోదు చేసామని తెలియుజేయుటకు సంతోషిస్తున్నాము. మీకు మరిన్ని బ్లాగులుంటే క్రింది Submit బటన్ క్లిక్ చేసి నమోదు చేసుకోవచ్చు.

Submit Your Blog

Submit Your Blog

మీ బ్లాగును బ్లాగ్ వేదికలో చేర్చుటకు ఈ Comment box 
కి మీ బ్లాగ్ URL ,మీ బ్లాగ్ గురించి రెండు మాటలు టైపు చేసి పంపించండి చాలు.24గం||లలో మీ బ్లాగును పరిశీలించి తీసుకోవడం జరుగుతుంది.

గమనించప్రార్ధన
* బ్లాగ్ వేదిక లోగో మీ బ్లాగుకు 
తప్పనిసరిగా జతచేసి సహకరించగలరు. బ్లాగ్ వేదిక లోగో అతికించని బ్లాగులు స్వీకరించబడవు.
* మంచి,మంచి మీ టపాలను పరిచయం చేసి మీ బ్లాగ్ లింక్ ఇవ్వడం,మీకు ముందుగా తెలియజేయడం జరుగుతుంది.
* త్వరలో ఎన్నో వినూత్న ఫీచర్లు.                                       
 * బ్లాగ్ వేదిక లోగో *

మీకు నచ్చని బ్లాగును 5 నిమిషాలలో Delete చేసేసుకోండి!

చాలా సందర్భాలలో మనం కొన్ని అవసరం లేని బ్లాగులను క్రియేట్ చేసుకుంటాం. వాటిని మెయింట్ నెన్స్ చేయడం ఇష్టం లేక ఆ బ్లాగును ఎలా Delete చేయాలో అర్ధం కాక చాలా తికమక పడతాము. అటువంటి పరిస్తితి గనుక వస్తే ఏవిధమైన టెన్సన్ పడాల్సిన అవసరం లేదు.మీరు చాలా సులభంగానే ఆ బ్లాగును Delete చేసేయవచ్చు. ఎలా అంటారా Sreen Shots తో పాటు వివరంగా తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Related Posts Plugin for WordPress, Blogger...