బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Showing posts with label Corona Virus News. Show all posts
Showing posts with label Corona Virus News. Show all posts

Janata Curfew success Rally | ఇదేంటి..జనతా కర్ఫ్యూ సక్సెస్ ర్యాలీనా..వీళ్లని ఏంచేయాలి?


Janata Curfew success Rally | ఇదేంటి..జనతా కర్ఫ్యూ సక్సెస్ ర్యాలీనా..వీళ్లని ఏంచేయాలి?

janata-curfew-success-rally
Janata Curfew success Rally
కరోనా వైరస్ ..దేశంలో వేగంగా  విస్తరిస్తున్న నేపథ్యంలో ఆదివారం ప్రధాని మోడీ పిలుపు మేరకు దేశం మొత్తం జనతా కర్ఫ్యూ కి పూర్తి మద్దతు ప్రకటించారు. అసలు ఈ జనతా కర్ఫ్యూ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే .. జన సమూహాల్ని నివారించడం. ప్రజలు బయట ఎక్కువగా తిరిగితే కరోనా వైరస్ ఉన్న వారి నుండి  వేరే వాళ్లకు వ్యాధి సోకుతుందని - వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని - కాబట్టి ఎవరి ఇళ్లలో వాళ్లు ఉంటే వైరస్ చైన్ బ్రేక్ అవుతుందని - దీని ద్వారా   కరోనా ప్రభావం కొద్దిగైనా  తగ్గుతుందని ఈ జనతా కర్ఫ్యూకి ప్రధాని మోడీ పిలునిచ్చారు.

అయితే ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు - కరోనా వైరస్ పై ఉన్న భయంతో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా జనాలు చాలా క్రమశిక్షణతో కర్ఫ్యూలో పాల్గొన్నారు. దేశ ప్రజానీకం మొత్తం  ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లన్నీ బోసిపోయాయి. దుకాణాలన్నీ మూతపడి జన సంచారమే లేదు. మొత్తంగా కర్ఫ్యూ సూపర్ సక్సెస్ అయినట్లే కనిపించింది. దీని వల్ల కరోనాకు చాలా వరకు బ్రేక్ పడి ఉంటుందని అంచనా వేశారు. అయితే ఉదయం నుండి సాయంత్రం 5 వరకు ఎంతో అప్రమత్తంగా ఉన్న జనాలు.. సాయంత్రం వేల అదుపు తప్పారు.

కరోనా 4 రకాలుగా ప్రమాదం తలపెడుతోంది?



కరోనా 4 రకాలుగా ప్రమాదం తలపెడుతోంది?

Can-The-China-Virus-Corona-Hurt-In-4-Different-Ways
కరోనా 4 రకాలుగా ప్రమాదం తలపెడుతోంది?
వైరస్ అన్నది చాలా కామన్. అన్ని వైరస్ లు ఒకేలా ఉండవన్నట్లుగా కరోనా.. మిగిలిన వైరస్ లకు చాలా భిన్నం. ప్రపంచాన్ని వణికించిన చాలా వైరస్ లు ఉన్నాయి. ఒకప్పుడు సార్స్.. మెర్స్ వైరస్ లు వణికించాయి. కాకుంటే.. వీటితో పోలిస్తే కరోనా ప్రత్యేకత ఉంది. ఈ వైరస్ అత్యంత వేగంగా విస్తరించే గుణం ఉంది.

ప్రాణాలు తీసేది తక్కువే అయినా.. ప్రాణం పోయేంతలా తిప్పలు పెట్టే సత్తా దీనికి ఎక్కువ. అన్నింటికి మించిన.. ఈ వైరస్ వ్యాపించిన విషయం తెలీకుండానే.. శరీరంలో కొన్నిరోజుల పాటు తిష్ట వేసిన తర్వాతే తన విశ్వరూపాన్ని చూపిస్తుంటుంది. ప్రపంచంలో ప్రమాదకరమైన వైరస్ లకులేని గుణం.. కరోనాకు ఉన్న మరో గుణం ఏమంటే.. చాలా తక్కువ వ్యవధిలోనే ప్రపంచం మొత్తాన్ని చుట్టేయటం.

నెలాఖరు దాకా తెలంగాణ లాక్ డౌన్.. కేసీఆర్ ఇంకేమన్నారంటే?


నెలాఖరు దాకా తెలంగాణ లాక్ డౌన్.. కేసీఆర్ ఇంకేమన్నారంటే?

Telangana-Lock-Down-Till-31st-March-2020
నెలాఖరు దాకా తెలంగాణ లాక్ డౌన్.. కేసీఆర్ ఇంకేమన్నారంటే?
కరోనా వైరస్ విస్తరణను నియంత్రించే క్రమంలో ప్రపంచ దేశాలతో పాటు ఆయా దేశాల్లోని రాష్ట్రాలు స్థానిక ప్రభుత్వాలు కీలక నిర్ణయా దిశగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం (ఈ నెల 22) ఒక్కరోజు జనతా కర్ఫ్యూ పాటిద్దామంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనకు దేశం యావత్తు సంపూర్ణ మద్దతు తెలిపిన వేళ... కరోనాను పూర్తిగా తరిమివేసేందుకు ఇదే తరహా స్వీయ నియంత్రణ చర్యలు తప్పవన్న భావనలో దేశంలోని పలు రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో ఈ నెలాఖరు దాకా లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్లుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదివారం సంచలన ప్రకటన చేశారు.

జనతా కర్ఫ్యూకు రాష్ట్ర ప్రజల స్పందన. కోవిడ్ విస్తృతిపై మీడియాతో మాట్లాడేందుకు ఆదివారం సాయంత్రం బయటకు వచ్చిన కేసీఆర్ పలు సంచలన నిర్ణయాలను ప్రకటించారు. కరోనా విజృంభణ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో ఈ నెలాఖరు దాకా లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్టుగా కేసీఆర్ చెప్పారు. ఇందులో భాగంగా ఎవరింటికి వారు పరిమితం కావాలని ఇవాళ జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రదర్శించిన స్ఫూర్తిని ఈ నెలాఖరు వరకు కనబర్చాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఎక్కడా ఐదుగురికి మించి గుమికూడవద్దని స్పష్టం చేశారు. ఈ నిబంధన కఠినంగా అమలు చేస్తామని చెప్పారు.

డేంజర్ బెల్: తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా!


డేంజర్ బెల్: తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా!

Danger-bell-16-Corona-Virus-Cases-Reported-in-Telangana-State
డేంజర్ బెల్: తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా!
తెలంగాణలో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది.  చైనా నుంచి వచ్చిన ఈ మహమ్మారిని విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు తీసుకొచ్చి మనకు అంటించారు. తాజాగా గురువారం మరో మూడు పాజిటివ్ కేసులు తెలంగాణలో నమోదు కావడంతో తెలంగాణలో మొత్తం కరోనా రోగుల సంఖ్య 16కు చేరింది..

14 కేసులు ఇప్పటివరకు అని ప్రకంటించిన తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ.. తాజాగా లండన్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు కరోనా ఉందని తేల్చడంతో మొత్తం కేసుల సంఖ్య 16కు చేరింది. మార్చి 14న దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తికి కరోనా తేలింది. అతడి కుటుంబ సభ్యులను ఇంట్లోనే ఉంచి ఐసోలేషన్ చేస్తున్నారు. ఇతడు ప్రయాణించిన విమానంలో కూడా ప్రయాణించిన తోటి వారి వివరాలు సేకరిస్తున్నారు.

ఆంధ్రాలో వ్యాపిస్తున్న కరోనా వైరస్...పెరిగిపోతున్న అనుమానితులు.. బీ అలెర్ట్

ఆంధ్రాలో వ్యాపిస్తున్న కరోనా వైరస్...పెరిగిపోతున్న అనుమానితులు.. బీ అలెర్ట్

China-Virus-Corona-In-Andhra-Pradesh
ఆంధ్రాలో వ్యాపిస్తున్న కరోనా వైరస్...పెరిగిపోతున్న అనుమానితులు.. బీ అలెర్ట్
సర్వత్రా వ్యాపించిన కరోనా భయం అంతకంతకూ విస్తరిస్తోంది. చైనాలో స్టార్ట్ అయి.. చూస్తుండగానే యావత్ ప్రపంచాన్ని చుట్టేయటమే కాదు.. కొన్నిదేశాల్లో దారుణమైన పరిస్థితులకు ఈ సూక్ష్మజీవి కారణమైంది. ప్రపంచం సంగతి పక్కన పెట్టి.. మన దేశంలో.. అందునా తమ తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో ఐదు కేసులు (ఒక కేసు విషయంలో స్వస్థత పొంది డిశ్చార్జ్ అయ్యారు కూడా) నమోదు కాగా.. ఏపీలో మాత్రం ఇప్పటి వరకూ ఒక కేసు మాత్రమే నమోదైంది.

ఇదంతా చూస్తున్నప్పుడు బాగానే ఉన్నా.. పెను ప్రమాదం పొంచి ఉందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ఏపీలో కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన కొద్ది రోజులుగా అనుమానిత కేసులు పెద్దగా లేనప్పటికీ.. గడిచిన ఒకట్రెండు రోజుల్లో అనుమానిత కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతానికి ఇది కాస్తా 22కు చేరుకోవటం ఆందోళనను కలిగిస్తోంది. దేశంలో కరోనా వైరస్ రెండో దశలోకి అడుగు పెట్టిందన్న అధికారిక ప్రకటనతో అనుమానితుల సంఖ్య పెరిగే కొద్దీ ఆందోళన పెరిగిపోతోంది. దీనికి తోడు.. ఏపీలో పెరుగుతున్న అనుమానితులు నివసిస్తున్న జిల్లాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఎప్పుడేం జరుగుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

దేశవ్యాప్తంగా హై అలెర్ట్: భారత్ లో 107కరోనా కేసులు..

China-Coronavirus-Cases-In-India-Reach
దేశవ్యాప్తంగా హై అలెర్ట్: భారత్ లో 107కరోనా కేసులు..

దేశవ్యాప్తంగా హై అలెర్ట్: భారత్ లో 107కరోనా కేసులు..

ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ భారత్ లోనూ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ వేగంగా పెరుగుతూ పోతోంది.

ఇప్పటివరకు దేశంలో 107 కేసులు నమోదైనట్టు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 31 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 12 కొత్త కేసులు పెరిగాయి. కేరళలో ఇప్పటివరకు 22 యూపీలో 11 హర్యాణాలో 14 కేసులు ధ్రువీకరించారు. వీరంతా విదేశీయులేనని కేంద్రం తెలిపింది.

Related Posts Plugin for WordPress, Blogger...