 |
These 12 types of e-mails are open to Danger! |
ఇంటర్నెట్ వాడకం అనేది విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో దాడులు కూడా అంతే స్థాయిలో పెరిగిపోతూ వస్తున్నాయి. సైబర్ క్రిమినెల్స్ ఈ ఇంటర్నెట్ సాయంతో అనేక చోరీలను చేస్తున్నారు. యూజర్ల వ్యక్తిగత సమాచారం దగ్గర నుండి మొత్తం బ్యాంకు అకౌంట్ల వరకు సమస్త సమాచారాన్ని తమ అదుపులోకి తీసుకుంటున్నారు. హ్యాకింగ్ టూల్స్ ని ఉపయోగించి బ్యాంకులను సైతం కొల్లగొట్టేస్తున్నారు. ముఖ్యంగా స్పామ్ ఈ మెయిల్స్ ద్వారా అనేక రకాలైన మోసాలకు పాల్పడుతున్నారు.
స్పామ్ మెయిల్స్ పంపించి యూజర్లను వారి ట్రాప్ లోకి లాక్కుని అందినకాడికి దోచుకుంటున్నారని ఈ మధ్య కొన్ని సెక్యూరిటీ సంస్థలు సైతం అలర్ట్ మెసేజ్ లు జారీ చేశాయి. అలాంటి వాటిల్లో ఈ మధ్య ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ బర్రాకుడా నెట్ వర్క్ కూడా కొన్ని అలర్ట్ మెసేజ్ లను జారీ చేసింది. అవేంటో ఓ సారి చూద్దాం.