కొందరు చాలా తొందరగా నిర్ణయాలు తీసేసుకుంటారు. మరికొందరు నిర్ణయం తీసుకోలేక, అటూ,ఇటూ ఊగుతూ ఆసరా కోసం చూస్తుంటారు. యూకే,బ్రిస్టల్ కి చెందిన ఓ పేరు తెలియని అమ్మడిది కూడా అదే డోలాయమానస్థితి. అందుకే ఆమె బార్క్ కామ్ అనే వెబ్సైట్ లో ఓ యాడ్ పోస్ట్ చేసింది. దాని సారాంశం ఏమిటంటే... ఓ నెలరోజులు పాటు తన జీవితంలో జరిగే, చిన్నవైనా,పెద్దవైనా సంఘటనలకు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి ఉద్యోగి కావాలి అని! గత సంవత్సరం ఆమె తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో ప్రస్తుత సంవత్సరం అయినా బాగుండాలనే తలంపుతో ఆమె యాడ్ ఇచ్చిందట. సదరు ఉద్యోగానికి గాను ఆమె ఇస్తానంటున్న జీతం 2000 యూరోలు! ప్రపంచ గమనం ఎటుపోతుందో కదా!
కేసీఆర్ ని పంపిస్తే సరిపోతుంది. వేగంగా నిర్ణయాలు తీసుకుని వేగంగా అమలుచేస్తారు.
ReplyDelete