బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు బ్లాగులను బ్రతికించుకుందాం!

ప్రతి ఒక్కరూ తన యొక్క భావాలను,అభిప్రాయాలను,ఆలోచనలను...ఇలా అన్ని విషయాలను నలుగురితో పంచుకోవడానికి ఉపయోగపడే వేదిక:తెలుగు బ్లాగు.ఒక మంచి పోస్టు వ్రాస్తే దానిని చదివేవారు మహా అయితే కేవలం 200 నుండి 300వరకు ఉంటారేమో! ఇతర భాషల్లో బ్లాగులకు లభిస్తున్న ప్రాచుర్యంలో కనీసం 10% కూడా తెలుగు బ్లాగులకు దక్కడం లేదు.ఈ మాత్రమన్నా దక్కుతుందంటే కేవలం కూడలి, మాలిక ,బ్లాగిల్లు లాంటి అగ్రిగేటర్ల వలననే! అవే లేకపోతే తెలుగు బ్లాగులకు గతే లేదు.మన తెలుగు బ్లాగులను మనమైనా జాగ్రత్తగా కాపాడుకోవాలి.ప్రతి బ్లాగరు మంచి,మంచి టపాలు వ్రాయాలి.పాఠకుడికి తెలుగు బ్లాగులను చదివే ఉత్సాహం,ఆసక్తి కేవలం బ్లాగరు మాత్రమే తీసుకురావాలి.ముఖ్యంగా మన అగ్రిగేటర్లను మనం కాపాడుకోవాలి.వాటి లోగోలను మన బ్లాగులకు అతికించుకుని వాటికి సహకరించాలి.జై తెలుగు బ్లాగులు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...