* Justice conquered by love * |
🔸 న్యాయం విషయంలో తన ప్రియాతి ప్రియమైన భార్య రాణి నూర్జహాన్ ను కూడా క్షమించలేదు.
🔸 ఆ గాధ మరుపు రానిది ప్రఖ్యాతి గాంచింది.
1. ఒకసారి రాణి నూర్జహాన్ పచార్లు చేస్తూ ఉంది సాధారణంగా చుట్టుప్రక్కల ఏ మగవాడూ సంచరించకుండా ఏర్పాటు ఉంటుంది.
2. అదే సమయంలో ఒక చాకలివాడు అనుకోకుండా అటు వైపు రావడం జరిగింది.
3. అతని దృష్టి పచార్లు చేస్తున్న రాణి పై పడింది. రాణి కూడా అతన్ని చూసింది.
4. పరపురుషుని దృష్టిలో తాను పడ్డందుకు ఆమెకు ఎంతో సిగ్గు, కోపం కలిగాయి.
5. వెనకా ముందు ఆలోచించకుండా బాణం తీసుకుని అతని పైకి వదిలింది.
6. చాకలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
7. చాకలి వారసులు రాణి నూర్జహాన్ పై హత్యారోపణ చేశారు. కేసు కోర్టుకు వెళ్లింది, పరిశోధన జరిగింది. న్యాయ విచారణ ప్రారంభమైంది.
8. నూర్జహాన్ నిజాన్ని దాచలేదు. నేరాన్ని ఒప్పుకుంది. అతన్ని బాణంతో కూల్చింది తానే అని చెప్పింది.
*9. రాజు, న్యాయాధిపతి అయిన జహంగీర్, నూర్జహాన్ కు ఉరిశిక్ష విధించాడు.*
10. రాణి నూర్జహాన్ను మామూలు ఖైదీ లాగా బంధించి చెరసాలకు తీసుకుని వెళ్లారు.
11. హత్య నేరాలు చేసిన వారికి లభించే భోజన పానీయాలే ఆమెకు ఏర్పాటు చేయబడ్డాయి.
12. జహంగీర్ ఇచ్చిన ఈ తీర్పు రాజధానిలో కలవరం సృష్టించింది.
13. ప్రజలు రాణి నూర్జహాన్ ను శిక్ష నుండి తప్పించడానికి ఉపాయాలు ఆలోచించసాగారు.
14. పాదుషాకు సిఫార్సులు చేశారు.
15. కానీ పాదుషా తన తీర్పును మార్చటానికి సిద్ధం కాలేదు.
16. చాకలి వారసులు తాము కోరినంత రక్త పరిహారం తీసుకుని "ప్రాణానికి ప్రాణం" అనే వాదనను విడనాడవలెను అని ప్రజలు నచ్చజెప్ప ప్రయత్నించారు.
17. పాదుషా తీర్పుకు చాకలి కుటుంబీకులు కూడా చాలా ప్రభావితులయ్యారు.
18. రక్త పరిహారం గురించి వారికి నచ్చ చెప్పటం జరిగింది.
19. చివరకు వారు రాణి నూర్జహాన్ ను క్షమించడానికి సంసిద్ధులయ్యారు.
20. వారు క్షమాపణ పత్రం రాసి పాదుషాకు సమర్పించారు.
21. అప్పటికిగాని రాజు తన తీర్పును మార్చుకోలేదు. మహారాణి ప్రాణాలు దక్కాయి.
నూర్జహాన్ అంటే జహంగీర్ కు ఎంత ప్రేమో క్షమాభిక్ష తరువాత ఆయన ఆమెతో అన్న మాటలు వ్యక్తం చేస్తాయి.
*"రాణి! నీవు మరణించి ఉంటే నేను మాత్రం జీవించి ఉండేవాణా?"*