45మందికి పైగా మన జవాన్లను హతమార్చిన పాకిస్తాన్ సంబంధిత టెర్రరిస్ట్ వ్యవహారంలో మన భారత ప్రభుత్వం ఇక శాంతించినట్లే. కాదు, కాదు మర్చిపోయినట్లే. మళ్ళీ ఎప్పుడన్నా కొన్ని నెలలకు మరికొంతమంది మన జవాన్లు బలయ్యినప్పుడు అదిగో,ఇదిగో అంటూ హడావుడి చేసి మళ్ళీ మర్చిపోతుంది. రోడ్డున పడ్డ జవాన్ల కుటుంబాలు ఫించన్ కోసం కోర్టుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి,తిరిగి కొన్నాళ్ళకు వాళ్ళూ మర్చిపోతారు. ఇదే మన భారత ప్రభుత్వాల పనితీరు. అన్ని పార్టీలు అంతే.
మన భారత్ కొట్టే ఒక దెబ్బకు పాకిస్తాన్ దుకాణం మూసుకోవాల్చిందేనంటూ గొప్పలు చెప్పే నాయకులు ఎందుకు పాకిస్తాన్ కు సరైన బుద్ధి చెప్పలేకపోతుందో నాకర్ధం కావడం లేదు. నిజానికి యుద్ధంలో అమరులయ్యే మన జవాన్ల కంటే టెర్రరిస్టుల దెబ్బకు బలవుతున్న దేశ జవాన్లు, ప్రజలే ఎక్కువ. మన దేశ ప్రతిష్టతను, సమగ్రతను తీవ్రంగా దెబ్బ తీస్తున్న పాకిస్తాన్ టెర్రరిస్ట్ ముఠాలను తుడుచి వేయలేదా? ఇదే పరిస్థితిలో అమెరికా ఉంటే ఊరుకుంటుందా? పక్కనున్న చైనా సహిస్తుందా? ప్రతీదాంట్లోనూ రాజకీయాలేనా?

No comments:
Post a Comment