బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

పవన్ కళ్యాణ్ గారి ఓవరేక్షన్!

పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు ఆఖరికి రాజకీయాలలో కూడా ఓవరేక్షన్ ఎక్కువయ్యింది. తునిలో కాపు గర్జన అల్లర్లు విని ఈయన గారు షూటింగ్ మరీ మానుకుని హైదారాబాద్ వచ్చేసి ఏవో చార్లీ చాప్లిన్ మాదిరిగా ఒక ఫోజు పెట్టి ఏవేవో నోటికొచ్చిన నాలుగు మాటలు మాట్లాడేసి వెళ్లిపోయాడు. ఈయనగారు తనకు తను స్వాతంత్ర సమర యోధుడనుకుంటున్నాడో ఏమో! ఈయనగారు,వీళ్ళ అన్న చిరంజీవిగారు పార్టీ పెట్టి మూసేయడం తప్ప చేసిందేమి లేదు. చిరంజీవి మంచి నటుడు అలాగే రజనీకాంతలా, కమల్ హాసన్లా సినిమాలకే పరిమితమై ఉండియుంటే ఎంతో పేరు నిలబడి యుండేది! రాజకీయాల జోలికొచ్చి కాస్త ప్రజలలో చులకన అవ్వాల్సి వచ్చింది. ఏది,ఏమైనా చిరంజీవిగారు మంచి నటుడిగా చెరగని గుర్తింపు ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ ఓవరేక్షన్ మాత్రం ఆంధ్ర ప్రజలు భరించలేకపోతున్నారు.

4 comments:

  1. "వీళ్ళ అన్న చిరంజీవిగారు పార్టీ పెట్టి మూసేయడం తప్ప చేసిందేమి లేదు"

    పోలిక బాలేదండీ. ఎంత చెడ్డా చిరంజీవి పార్టీని కొన్నేళ్ళు నడిపించారు, 18 సీట్లు గెలిచారు, కేంద్ర మంత్రి హోదా సాదించారు. తమ్ములుం గారికి అంత సీను ఉందంటారా?

    ReplyDelete
    Replies
    1. నిజానికి చిరంజీవిగారికి,పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం పోలిక లేదన్న మాట వాస్తవం. మీరన్నట్టు కేంద్ర మంత్రి పదవి సాధించినా ఎన్నేళ్లు కొనసాగారు? ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ మూతబడిపోయింది చిరంజీవిగారు కూడా మాజీ అయ్యిపోయారు.ఆయన పార్టీ పెట్టినప్పుడు చేసిన హడావుడి అంతాఇంతా కాదు ఏదో శాధించేస్తాడనుకున్న మాలాంటి యువకులకు నిరాశ మిగిలించాడు.ఇప్పుడు జనసేన అంటూ తమ్ముడు దిగాడు.ఇది మూన్నాళ్ల ముచ్చటే!

      Delete
  2. పాదయాత్రలో చంద్రబాబు నోరు జారకుండా ఉండి ఉంటే మీకు ఈ బాధ తప్పేది కదా ?

    ReplyDelete
    Replies
    1. మాకు ఏవిధమైన బాధ లేదు నీహారికగారు. ఎవరి హక్కులు కోసం వారు పోరాడడంలో తప్పు లేదు.కానీ ఈ కుల రాజకీయాలు మాత్రం భరించలేకపోతున్నాము.కుల ప్రాతి పదికన జరిగే రిజర్వేషన్లే తప్పు అని ఎప్పటినుండో నా వాదన ఉంది. ఇప్పుడు కాపులు, రేపు చౌదర్లు,తరువాత రెడ్లు,రాజులు ఇలా వరుసగా ధర్నాలు తప్పకుండా జరుగుతాయి. పేదవారు కూటికి గతిలేనివారు అన్నీ కులాల్లో ఉన్నారు..

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...