బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

కూడలి పని చేస్తుంది.

కూడలి మూతపడిన తరువాత ఒక్కసారిగా తెలుగు బ్లాగుల ప్రపంచం ఉలిక్కి పడిన విషయం మీకందరికీ విదితమే!. కాని కూడలి మీద అభిమానమున్నవారు ఈ క్రింది లింక్ ద్వారా కూడలిని వీక్షించవచ్చు. కూడలిని మూసివేయక పొవుట చూస్తుంటే కూడలిని మళ్ళీ నడిపే అవకాశం ఉందేమో అనిపిస్తోంది. ఏది,ఏమైనా కూడలి వస్తే తెలుగు బ్లాగర్లకు ఆ ఆనందమే వేరు.
 కూడలి కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

4 comments:

  1. Thanks for sharing the info sir.

    ReplyDelete
  2. లేదండీ అది డిసెంబర్ 29నే ఆగిపోయింది . ఇక్కడచూదండి
    http://koodali.org/blogs

    ReplyDelete
  3. కూడలి కూలిపోవటానికి కారణం యాగ్రిగేటర్ కు ఏది కలపవచ్చు ఏది కలప కూడదు అన్న విచక్షణ లేకపోవటం , ఏ ఏ బ్లాగర్లు అల్లరిగా ప్రవర్తిస్తున్నారు అన్న విషయం మీద స్పందించకుండా చూపిన నిర్లిప్తత, కమర్షియల్ వెబ్ సైట్లను బ్లాగుల రూపంలో కూడలికి కలపటం లేదా బ్లాగుగా ఇక్కడ కలిపి, వెళ్ళి చూస్తె అక్కడ కమర్షియల్ వెబ్సైటు కు లింకు ఉన్న బ్లాగులు ఎక్కువ అవ్వటం ముఖ్యమైన కారణాలు ఈ ఈ కారణాలవల్ల నా బ్లాగులు కూడలి నుంచి కొంత కాలం క్రితం తొలగింపచేసుకున్నాను. కొన్ని కొన్ని బ్లాగుల్లో చర్చల కంటే వాదనలు, విపరీత వాదనలు, పిడి వాదనలు, ఒకే ఇజానికి సంబంధించిన బ్లాగులు తెగ వ్రాసి ఇతర బ్లాగులు కనపడకుండా చెయ్యటం వంటి ప్రక్రియలు అడ్డుకోలేకపోవటం మరొక కారణం. ఎదో "బ్లాగుడు కాయలు" అని పెట్టారు కాని ఎక్కువ బ్లాగులు అందులోనే ఉండటం వల్ల ఉపయోగం జరగలేదు వారానికి ఒక్క పోస్టు మాత్రమె అనుమతించటం మొదలుపెడితే ఈ అల్లరి తగ్గేది, ఆపైన వ్రాతలలో నాణ్యం (క్వాలిటీ) పెరిగేది. ఔత్సాహిక బ్లాగర్లు వ్రాస్తున్నంత కాలం దాదాపుగా 2012 వరకూ బాగున్నది. ఔత్సాహిక బ్లాగర్లను పక్కకు తోసేసి ప్రొఫెషనల్ బ్లాగర్లు తయారయ్యారు. దాంతో కూడలికి వెళ్ళి చూడాలన్న ఉత్సాహం నశించింది. ఈ చివరి కారణం, మొత్తం మీద కూడలికి వచ్చే వీక్షకులను బాగా తగ్గించసింది. The proverbial last straw. ప్రస్తుతం ఉన్న యాగ్రిగేటర్లు (మాలికతో కూడా కలిపి) కూడలి చేసిన పొరబాట్ల నుంచి నేర్చుకోవటం మంచిది. లేదంటే కాంగ్రెస్సును తిట్టి బిజేపి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ లాగానే ప్రవర్తించినట్టుగా ఉంటుంది.

    ReplyDelete
  4. కూడలి మళ్ళీ వస్తే తెలుగు బ్లాగర్లకు ఆ ఆనందమే వేరు ...

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...