బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు బ్లాగుల ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుందా?

ఈమధ్య బ్లాగులను విమర్శించడం ఫ్యాషన్ గా మారిపోయింది. సినిమా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏదైనా ఒక సినిమా తీస్తే రిలీజ్ కి ముందు మీడియాలో గందరగోళం సృష్టిస్తాడు. అతని అసలు ఉద్దేశ్యం ఏమిటంటే ప్రజలందరిదృష్టి అతను తీసిన ఆ పనికిమాలిన సినిమా వైవునకు మళ్లించాలని. అతను సినిమా ఎంత చెత్తగా తీసిన లాభాలతో ఆ సినిమా పెట్టుబడిని వారం, పది రోజుల్లో లాగేస్తాడు.జనానికి ఆ సినిమాలో ఏం లేదని అర్ధమయ్యేలోపు జరగాల్సిన పనులన్నీ జరిగిపోతాయి.ఆయనగారు ఎంతగా జనాన్ని ప్రభావితం చేస్తాడంటే సినిమా చూసిన వాడు చూడని వాడితో ఆ సినిమాకి వేస్ట్ బాగోలేదు అని చెప్పినా చూడనివాడు సినిమా చూసి బాగోలేదని కనఫర్మ్  చేసుకునే వరకూ ఉండలేడు. అంతలా ఆయన మత్తు పని చేస్తుంది. ఈమధ్య కొంతమంది బ్లాగర్లు ఇదే పని పెట్టుకున్నట్టున్నారు. తమ బ్లాగులను పాపులర్ చేసుకోవడం కోసమో లేక ఏమి వ్రాయాలో అర్ధం కాకో ఇతర బ్లాగులను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఈ ఒరవడి తెలుగు బ్లాగులకు ఏమాత్రం ఆరోగ్యకరమైనది కాదని తెలుసుకోవాలి. వీలైతే తెలుగు బ్లాగులను ప్రోత్సాహించండి. అద్భుతమైన తెలుగు బ్లాగుల ప్రపంచాన్ని నెలకొలిపే ప్రయత్నం చేయండి.అంతే కాని ఎదుటి వారి బ్లాగులను దూషించకండి. వీలయితే, వాటి యొక్క ఉన్నతికి సహకరించండి.అంతే కాని దయచేసి బ్లాగ్ ఫ్యాక్చనిజాన్ని తిరిగి లేపకండి ప్లీజ్! 

4 comments:

  1. రాం గోపాల్ వర్మ నైజం చాలామందికి అర్ధమయి అతనిని ఇగ్నోర్ చేస్తున్నారు. మనమూ ఇక్కడ చేయాల్సింది ఈ సోకాల్డ్ అతి విమర్శకులని వదిలేసి మంచి బ్లాగులను ప్రోత్సహించడమే. నేనీ నిర్ణయానికి వచ్చాకనే మంచి బ్లాగుల లిస్టుని ఏరుతున్నాను. రోజూ వీలయినన్ని మంచి బ్లాగులలో కామెంట్లు పెడుతూ ప్రోత్సహిస్తున్నాను. ఇంతక్రితం ( నేను బ్లాగులలోకి రాకముందు ) కూడా ఇక్కడేవో యుద్ధాలు జరిగేవట.

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పింది 100% కరెక్ట్ సర్!

      Delete
  2. నేను చదివిన ఓ పాఠం-
    ఫీడ్ బ్యాక్(నిర్మాణాత్మక సద్విమర్శ) ఒక పని చేసినప్పుడు అది ఇతరుల ప్రసంశలు పొందగలిగితే సంతోషిస్తాము. ఇతరులు మన లోపాలను ఎత్తిచూపి అభివృద్ధి పరచుకోవలసిన అవసరం గురించి ప్రస్తావించినప్పుడు బాధపడకుండా ఆ అంశాలను గుర్తించి, చొరవతీసుకుని అభివృద్ధి పరచుకోవడం విజ్ఞులలక్షణం. ఇది ఫీడ్ బ్యాక్ యొక్క లక్షణం. తమ పనితీరుగురించి ఇతరుల ఫీడ్ బ్యాక్ సహృదయంతో స్వీకరించడానికి, అలాగే, ఇతరుల పనితీరుగురించి సహృదయంతో తమ ఫీడ్ బ్యాక్ బృందంలోని అందరు సంసిద్ధులై ఉండాలి. ఫీడ్ బ్యాక్ ఇస్తున్నప్పుడు నొప్పించకుండా ఉండాలి. ఫీడ్ బ్యాక్ లేకుండా చేపట్టిన కార్యక్రమాల ఫలితాలను బేరీజువేసుకుని అభివృద్ధి పరచుకోవడం కష్టమవుతుంది. ఫీడ్ బ్యాక్ అంటే నిర్మాణాత్మక సద్విమర్శ అనిగ్రహించండి.ఎవరి గురించైనా ఫీడ్ బ్యాక్ ఇస్తున్నప్పుడు ముందుగా వారి పనితీరులో మీకు నచ్చిన అంశాలను ప్రస్తావించడం మంచిది. ఆ తరువాత ఏఏ అంశాలు ఇంకా అభివృద్ధి పరచుకోవలసిన అవసరంఉందని మీరు భావిస్తున్నారో వాటిని ప్రస్తావించండి. ఆ తరువాత, మీకేమైనా అంశాలుఉన్న పక్షంలో సహేతుకంగా ప్రస్తావించండి. ఈ ఫీడ్ బ్యాక్ స్వీకరించిన తదుపరి ఎదుటివారు మలి ప్రయత్నంలో మీ అభిప్రాయాలను గౌరవించినట్లు అనిపించినపుడు వారిని అభినందించండి. అభినందిస్తున్నప్పుడుగానీ, అభ్యంతరాలు చెబుతున్నప్పుడుగానీ, వాడే భాషాపదజాలం గురించి జాగ్రత్త వహించండి. ఎదుటి వ్యక్తి ఫీడ్ బ్యాక్ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే మీ ఫీడ్ బ్యాక్ ఇవ్వండి.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్య బాగుంది.
      ఒక చిన్న సంగతి, నా చాదస్తం కొద్దీ చెబుతున్నాను. "మనోసాక్షి" అన్న పదం ఏర్పడదండీ. "మనస్సాక్షి" అన్నదే సరైన పదం. మీరు సంస్కృతభాషను సరిదిద్దే పక్షంలో నేను చెప్పగలిగింది ఏమీ లేదనికోండి అది వేరే విషయం. అన్యధా భావించవద్ద్దు.

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...